స్వర్గీయ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘననివాళులు
పాయకరావుపేట,పెన్ పవర్
భారతీయ జనసంఘ్ వ్వవస్థాపకులు జాతీయనాయకులు స్వర్గీయ శ్యాంప్రసాద్ ముఖర్జీ 68వ వర్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా గ్రందాలయ మాజీ చైర్మెను,బిజేపి సీనియర్ నాయకులు తోట నగేష్ ఆద్వర్యంలో స్థానిక ఆయన స్వగృహంనందు మంగళవారం బిజేపి నాయకులు,కార్యకర్తలతో కలిసి ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఇప్పటి భారతీయ జనతా పార్టీ కి మూలపురుషుడు శ్యాంప్రసాద్ ముఖర్జీనని అన్నారు.ఏక్ దేశ్ మే ధో విదాన్,ధో ప్రధాన్ ,ధో నిషాన్ నహీ ఛలేంగే ,ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు,ఇద్దరు ప్రధానులు,రెండు జాతీయపథాకాలు వుండటాన్ని సహించలేమని ముఖర్జీ నినాదించేవారని,హిందూ, ముస్లీంలకువేరుగా గాక దేశమంతటకి ఒకే చట్టం వుండాలని పోరాడిన గొప్పదేశభక్తిగల నాయకుడని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రవిరాజు,కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment