అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట
చింతపల్లి జూన్ 23 పెన్ పవర్
తాను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు మండలంలో పట్టుబడిన వివిధ అక్రమ కేసుల వివరాలు ఇలా ఉన్నాయని స్థానిక ఎక్సైజ్ సీఐ సింహాద్రి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ తాను 2019 డిసెంబర్ నెలలో చింతపల్లి ఎక్సైజ్ సీఐ గా పదోన్నతి పై వచ్చానన్నారు. నాటి నుండి నేటి వరకు 116 కేసులు నమోదయ్యా యన్నారు. 93 మందిని వివిధ అక్రమ రవాణా కేసుల్లో అరెస్టు చేశామన్నారు.వివిధ వాహనాలు 12 సీజ్ చేశామన్నారు. గంజాయి, నాటుసారా, పులిసిన బెల్లం ఊట,మద్యం, పట్టుబడిన వాహనాల వివరాలను ఆయన తెలిపారు. గడచిన ఆరు నెలల కాలవ్యవధిలో 3,862 కిలోల ఎండు గంజాయి, 41 కిలోల గంజాయి ద్రావణం స్వాధీనం చేసుకున్నామన్నారు. 781 లీటర్ల నాటుసారా, 11,900 లీటర్ల పులిసిన బెల్లం ఊట,180 మిల్లీ కలిగిన (12 లీటర్ల,600 మిల్లీ) 70 మద్యం క్వార్టర్ సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.అలాగే ఆటో, ట్రాక్టర్, లారీ,వ్యాన్ ఒక్కొక్కటి చొప్పున బోలోరోపికప్ వ్యాన్లు 2, ద్విచక్ర వాహనాలు 2, కార్లు 4 స్వాధీనం చేసుకున్నమన్నారు. అక్రమ వ్యాపారాలు, రవాణాను అడ్డుకునేందుకు తమ శక్తి వంచన లేకుండా పని చేస్తున్నామన్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడేవారు ఎంతటివారైనా శిక్షార్హులే అని తెలిపారు. గ్రామాలలో నాటు సారా,గొలుసు మద్యం దుకాణాల వ్యాపారాలు విరమించుకోవాలని ఆయన హెచ్చరించారు.
Followers
అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
కుల వివాదంలో డిప్యూటీ సిఎం శ్రీవాణి... తాజా కోర్టు నోటీసుతో కలకలం 2014 నుంచే వెంటాడుతున్న వివాదం న్యాయస్దానంలో మంత్రిపై 3 కేసులు దాఖలు న్యా...
No comments:
Post a Comment