శ్యామ్ ప్రసాద్ సేవలు ఎనలేనివి
అనకాపల్లి , పెన్ పవర్
దేశానికి డాక్టర్ శ్యాంప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్యాంప్రసాద్ వర్థంతి కార్యక్రమం మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు 370 ఆర్టికల్ రద్దు చేయమని ఆయన ఆనాడే పోరాటం చేశారు అన్నారు. ఆయన కలల కన్నా కలని ప్రధానిగా మోదీ ఆర్టికల్ 370 ను రద్దు చేశారనారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రెటరీ ద్వారపురెడ్డి పరమేశ్వర రావు, దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు ఏ. కొండబాబు మాస్టారు ,మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు, అనకాపల్లి భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కర్రి రామకృష్ణ , భారతీయ జనతా యువమోర్చ జిల్లా గల్లా రాజు, దూలం బూసిరాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment