గిరిజన మహిళా ఉద్యోగిని వేదిస్తున్న డాక్టర్.
గిరిజన ఉద్యోగ సంఘం ఆరోపణ.
కోటపాడు డాక్టర్ పై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు.
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
జిల్లాలో ని కె.కోటపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గిరిజన మహిళా ఉద్యోగి జి ధనలక్ష్మిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరిత వేధింపులకు గురిచేస్తున్నారని ఆల్ ఇండియా షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.సత్యనారాయణ ఆరోపించారు . బుదవారం ఆయన మాట్లాడుతూ గిరిజన ఉద్యోగుల పై వివక్షత చూపించి వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు . గిరిజన మహిళా ఉద్యోగి జి ధనలక్ష్మి చేతులపై ఎలర్జీ కారణంగా ఆమెకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఓ పి ఇంజక్షన్ రూమ్ జనరల్ డ్యూటీ ఆర్డర్ తెచ్చుకోవడం పై మెడికల్ ఆఫీసర్ కక్ష కట్టి వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు . నిబంధనలకు విరుద్ధంగా తమ కులస్తులు ఎఫ్ ఎం ఓ లకు ఇంజక్షన్ రూమ్ లో డ్యూటీ వేయడం కోసమే గిరిజన మహిళా ఉద్యోగిని వేధిస్తున్నారని అన్నారు . ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్న మెడికల్ ఆఫీసర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.అన్న జనరల్ సెక్రెటరీ కె. శోభన్ కుమార్ , జాయింట్ సెక్రెటరీ డి .సత్యనారాయణ , వర్కింగ్ ఉమెన్స్ సెక్రటరీ డాక్టర్ గీత తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment