కొత్త రేషన్ కార్డు లు పంపిణీ రెండు రోజుల్లో పూర్తి.
జె.సి. ఎం. వేణుగోపాలరెడ్డి.
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రకియ రెండు రోజులలో పూర్తిచేయనున్నట్లు జిల్లా జాయింటు కలెక్టరు ఎం. వేణుగోపాలరెడ్డి తెలిపారు. వారం పౌర సరఫరాల శాఖ, కమీషనరు కోన శశిధర్ జాయింటు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. రైస్ కార్డులు పంపిణీ, బయోమెట్రిక్ ఎక్నలెడ్జెమెంటు, సచివాలయాలలో 5 సేవలు, ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీపై నిర్వహించిన సమీక్షలో జాయింటు కలెక్టరు మాట్లాడుతూ జిల్లాకు 11,74,568 కార్డులు వచ్చాయని, ఇంకను 1,94,243 కార్డులు పంపిణీ చేయవలసి ఉందని, 2రోజులలో పంపిణీ పూర్తిచేస్తామని తెలిపారు. సచివాలయాలద్వారా అందిస్తున్న 5 సేవలకు సంబంధించి ఇప్పటి వరకు 17,567 ధరఖాస్తులురాగా సుమారు 10వేల ధరఖాస్తులను పరిష్కరించడమైనదని తెలిపారు. ఇంటింటికి సరుకులు పంపిణీచేయుటకు ట్రాక్టరు వెళ్లలేని వీధుల,ఇళ్లు జిల్లాలో 20 శాతం వరకు ఉన్నాయని, పూర్తి నివేదిక అందజేస్త్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సరఫరాల అదికార్లు శివప్రసాద్, నిర్మలాబాయి, సహాయ సరఫరాల అదికార్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment