విశాఖ మన్యంలో పడగ విప్పిన కరోనా మహమ్మారి.
రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
ఉలిక్కిపడిన ఏజెన్సీ.ఆందోళన చెందుతున్న గిరిజనం.
అంగళ్ళు వారపు సంతలు బహిష్కరిస్తున్న గిరిజన సంఘాలు.
విశాఖపట్నం_బ్యూరోఛీప్(పెన్ పవర్)
విశాఖ మన్యంలో కరోనా మహమ్మారి పడగవిప్పంది. రెండు చోట్ల పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏజెన్సీ ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో కరోనా వైరస్ సోకడంతో అధికార యంత్రాంగం గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయితీ జఫ్ఫా ర్ కి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో విశాఖ కి తరలించారు. గ్రామంలో బంధువు దహన సంస్కార ణలకు తిరుపతి నుంచి వచ్చిన యువకుడిని క్వారంటైన్ లో పరీక్షలు చేయగా వైరస్ బయటపడింది. 4 రోజుల క్రితం చింతపల్లిలో మహిళ హోంగార్డుకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రదేశాల నుంచి పలువురిని క్వారంటైన్ కి తరలించారు. ఈ పరిస్థితులు దృశ్య కరోనా వైరస్ మన్యంలో నివురుగప్పిన నిప్పులా మారింది. ఎక్కడ ఎంతమందికి కరోనా వైరస్ సోకింది అన్న అనుమానాలు వ్యక్త మవు తున్నాయి. మార్చి 21 నుంచి మొదలైన కరోనా లాక్ డౌన్ మే నెల వరకు ఏజెన్సీలో కట్టుదిట్టంగా అమలు జరిగింది. గ్రామాలకు గ్రామాలు దిగ్బంధం చేశారు. స్థానికులు మినహ ఇతరులను గ్రామాల్లోకి అనుమతించలేదు. ఇతర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చిన ససేమిరా పొమ్మన్నారు. ఫైనాన్స్ వ్యాపారులను సైతం దరిచేరనివ్వలేదు. ఈ వారపు సంతలు దుకాణాలు బహిష్కరించారు. సామాజిక దూరం తూచా పాటిస్తూ వచ్చారు. లాక్ డౌన్ సడలింపు లతో దుకాణాలు అంగళ్ళు తెరుచుకున్నాయి. దీంతో స్థానికేతరుల రాకపోకలు కూడా మొదలయ్యాయి. మైదాన ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విలయ తాండవం ఆడుతున్న దృశ్య గిరిజన ప్రాంతాల్లో వారపు సంతలు మరికొంత కాలం నిషేధించాలని గిరిజన సంఘాలు గొంతెత్తి కూస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో కరోనా చిచ్చు రాకుండా పటిష్టమైన జాగ్రత్తలు పాటిస్తున్న తరుణంలో కరోనా వైరస్ చింతపల్లి ముంచంగిపుట్టు మండలాల్లో వెలుగు చూసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోతున్న వారి వల్ల కరోనా విజృంభించే అవకాశం లేకపోలేదని గిరిజన నేతలు భావిస్తున్నారు. వర్షాకాలం కావడంతో గిరిజన గ్రామాలు అస్తవ్యస్తంగా ఉంటాయని కరోనా వైరస్ ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని అధికారులు హైరానా పడుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని అవగాహన చర్యలు మొదలయ్యాయి. ఎప్పటికైనా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గిరిజనులు భావిస్తున్నారు. దుకాణాలు ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు మాత్రమే తెరవాలని వ్యాపారులతో తీర్మానించారు. ఎవరైనా దుకాణాలు తెరిస్తే మూడు వేలు జరిమానా మాస్కు ధరించకపోతే 500 ఫైన్ విధించాలని తీర్మానించారు. జీకే వీధి అరకు జి.మాడుగుల పెదబయలు వారపు సంతలు ఇప్పట్లో తెరవకూడదు అని గిరిజన సంఘాలు కోరుతున్నారు. ముంచంగిపుట్టు మండలం దుకాణాలు మూసివేశారు. తరచూ కుంభవృష్టి వర్షాలు పారిశుద్ధ్యం దృశ్య అధికారులు అలర్ట్ ప్రకటించారు.
No comments:
Post a Comment