Followers

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సహాయం


ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సహాయం

 

అనకాపల్లి , పెన్ పవర్

 

కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంంలో ఆదివారం కూరగాయలు అందజేశారు.  పార్టీ కన్వీనర్ కొణతాల హరినాద్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. సమాజ సేవకులు కాండ్రేగుల శ్రీ రామ్  సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమ్ ఆద్మీ  నాయకులు తెెెెలిపారు. అన్నపూర్ణ బ్యాంక్ వీధిలో లో 150 మందికి ఆనపకాయలు పంపిణీ కార్యక్రమం చేేారు. ఈ కార్యక్రమంలో చరణ్ ,  భవాని తదితరులు పాల్గొన్నారు.


సొమ్ములు కేంద్రానివి,సోకులు రాష్ట్రానివి


 


సొమ్ములు కేంద్రానివి,సోకులు రాష్ట్రానివి


 


సఖినేటిపల్లి, పెన్ పవర్:


 


13 జిల్లాల తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ,జరుగుతున్న అభివృద్ధి పనులలో ఎక్కువ శాతం, కేంద్ర నిధుల తో అమలు జరుగుతు న్నా, అవన్నీ తామే చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ , రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం క్షమించరాని దని, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఉపాధ్యక్షులు మాలే. శ్రీనివాస నగేష్ ఆరోపించారు ఆదివారం సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం లో   జన జాగరణ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత చేసిన సంస్కరణలు, ప్రారంభించిన పథకాలు, సామాన్య ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు రాష్ట్రాలకు కేటాయించి, విడుదల చేస్తున్న, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు వీటి గురించి, ఎక్కడా ప్రస్తావించకపోవడం ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర పథకాల పేరు మార్చి, ప్రతిదానికి రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చి, సొంత పథకాలు గా రాష్ట్రంలో అమలు చేస్తు, విస్తృత ప్రచారం చేయడం ఎంతవరకు ధర్మం అని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం కోట్లాది రూపాయల నిధులను వివిధ పథకాలకు విడుదల చేస్తున్న, వాటి గురించి ఇప్పటి వరకు ,ఎక్కడా ప్రస్తావించకపోవడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాలకు ప్రధాని ఫోటో ఎక్కడ  ఉండకుండా శ్రద్ధ తీసుకొనే ముఖ్యమంత్రి, తనది, తన తండ్రి ఫోటోలు మాత్రమే వాటికి కూడా ఉంచి ప్రచారం చేయదాన్నీ ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇదే పద్ధతిని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆచరించి, తగిన మూల్యం చెల్లించుకుంది అని, జగన్ మోహన్ రెడ్డి కూడా గతి తప్పదని అని ఆయన జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి గణేష్ కళ్యాణ యజన పథకం ద్వారా ఈ ఏడాది నవంబర్ నెల వరకు ప్రతి ఒక్కరికి బియ్యము, పప్పు దినుసులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. కోట్లాది రూపాయలను ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కేంద్రములో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సామాన్య ప్రజలకు వాటి వివరాలు తెలియక పోవడం తమ పార్టీ పురోభివృద్ధికి కొడుకు లేదని ఆయన అన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 108 ,104 వాహనాలను ప్రతి మండలానికి కేటాయించడం జరిగిందని, వాటి కొనుగోలులో 40 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానీవే నని శ్రీనివాస్ నగేష్ చెప్పారు. ఈ విషయాన్ని దాచి పెట్టి ఈ వాహనాల తన సొంత నిధులతో ఉన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవాలని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ చేసిన అనేక పథకాల వివరాలను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెంపాటి. శివరామకృష్ణంరాజు, దంతులూరి. సీతారామరాజు, ఆకుల. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి




రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి



 

 

సఖినేటిపల్లి, పేన్ పవర్...

 

సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్వేది దేవస్థానం గుర్రాలక్కగుడి రోడ్డు పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో, ఒక వ్యక్తి మరణించినట్లు సఖినేటి పల్లి మహిళా ఎస్సై. భవాని చెప్పారు. అబ్బ దాసు. సాయి అనే వ్యక్తి ఏ.పీ. 37 బి. ఎల్. 36 04 నెంబరు గల సి.బి.జెడ్ మోటార్ సైకిల్ పై అంతర్వేది వస్తుండగా, ఒక్కసారిగా మోటార్సైకిల్ అదుపు తప్పడంతో, రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు, ఆమె చెప్పారు. మృతుడు ఏడవ తరగతి వరకూ చదివి,చదువు మధ్యలో అపి వేసాడని, రోజు వారి కూలీ పనులు, చేస్తూ ఉండేవాడు అన్నారు. ఇటీవలే ఇతనుఅప్పన రాముని లంకలోని ఒక చికెన్ షాపులో, రోజు వారి కూలీ కి పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భవాని చెప్పారు.


 సీతానగరం లో మూడుకు చేరిన కరోనా పాజిటివ్ లు


 


 సీతానగరం లో మూడుకు చేరిన కరోనా పాజిటివ్ లు


పెన్ పవర్ , సీతానగరం


 


మండలం నందు పాజిటివ్ కేసులు మూడుకు చేరాయని వైద్యాధికారి డాక్టర్ హారిక పత్రికా విలేకరులకు తెలిపారు. డాక్టర్ హారిక మాట్లాడుతూ కరోనా వైరస్ మండల పరిధిలో ఇనుగంటివారి పేట గ్రామంలో కలకలం రేపింది అన్నారు. ఈ గ్రామానికి చెందిన వారు ఈనెల ఫస్ట్ తారీఖున డి హెచ్ నందు వైద్య పరీక్షలు చేయించుకోగా 4వ తారీకు సాయంత్రం నిర్ధారణ అయిందని వీరిలో 42 సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి తన బామ్మర్ది విజయవాడలో కరోనా పాజిటివ్ తో మరణించగా అక్కడికి వెళ్లడం వలన కరోనా వైరస్ సోకిందని,25 సంవత్సరాలు కలిగిన మరొక వ్యక్తి కితన స్నేహితునికి కరోనా ఉండటంతో ఈ వ్యక్తికి సంక్రమించిందని డాక్టర్ హారిక తెలిపారు. ఇనుగంటివారి పేటకు చెందిన ఈ వ్యక్తులు ఇద్దరిని బొమ్మూరు కోవిడ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్నామన్నారు. గతంలో ఆర్టీసీ గ్యారేజ్ నందు మెకానిక్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి వైరస్ సోకకగా వైద్య సేవలు పొందుతున్నారనీ, అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తి తాడేపల్లి గ్రామంలోనే ఉండేవారని అతనికి కరోనా సంక్రమించగా భీమవరం నందు పరీక్షలు చేయించుకోవడం తో  ఈ వ్యక్తిని మండలంలో కి రాకుండానే బొమ్మూరు కోవిడ్ కేర్ నందు చేర్చి వైద్య సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్ హారిక తెలిపారు. ఇప్పటివరకూ మండలంలో కరోనా కేసులు మూడుకు చేరుకున్నాయని పాజిటివ్ కలిగిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు అనే వివరాలు తెలియాల్సి ఉందనీ కనుక మండల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని నిర్లక్ష్య వైఖరి విడనాడి కరోనా మహమ్మారి సోకకుండా అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు వైద్యాధికారిణి తెలియజేశారు.


కొండయ్య మృతి పట్ల బిజెపి రాష్ట్రం కార్యవర్గ సభ్యులు వీరన్న చౌదరి సంతాపం


కొండయ్య మృతి పట్ల బిజెపి రాష్ట్రం కార్యవర్గ సభ్యులు వీరన్న చౌదరి సంతాపం

పెన్ పవర్, సీతానగరం 

 

జాలిమూడి మాజీ సర్పంచ్ కడుగుల కొండయ్య మృతిపట్ల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీరు కొండ వీరన్న చౌదరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరన్న చౌదరి తెలియజేస్తూ ఐ ఎఫ్ ఎస్ నందు విశేష సేవలు అందించారని విలువైన నాయకుడిని మండలం కోల్పోయిందనీ ఉన్నత రాజకీయ విలువలతో ప్రతిభను ఘనంగా చాటిన సీనియర్ నాయకుడు కొండయ్య మరణం విచారకరమన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జీవితం గడిపిన నేత అని ప్రజాసేవలో జీవితాంతము గడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం మండల ప్రజలకు తీరని లోటు అన్నారు. కొండయ్య మరణవార్త తీరని దుఃఖంన్ని మిగిల్చిందని తెలిపారు.ఆ ఆదర్శ వాది ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ఆ కుటుంబ సభ్యులకు వీరన్న చౌదరి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పలువురు పార్టీలకతీతంగా కొండయ్య మరణంపై నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


మాకు న్యాయం చేయండి



మాకు న్యాయం చేయండి

 

- నాలుగు సంవత్సరాలుగా వెలిలో ఉన్నాం

 

- సొసైటీ ఆదాయం తమకు చెందకుండా కుల పెద్దలు అడ్జుకున్నారంటూ ఆరోపణ

 

- లక్ష్మీపోలవరంలో దళితుల నిరసన

 

రావులపాలెం, పెన్ పవర్

 

తమను వెలి వేసి సంఘ కార్యక్రమాలలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న కుల పెద్దలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ శనివారం రాత్రి లక్ష్మీపోలవరం గ్రామంలో కొన్ని కుటుంబాల దళితులు నిరసన చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు సంవత్సరాల క్రితం లూధరన్ దేవాలయంకు చెందిన స్ధలం మీదుగా గ్రామంలోని సంజీవయ్య మాల పేద కూలీ సంఘ పెద్దలు రోడ్డు వేయడానికి నిర్ణయించారు. అయితే ఈ సంఘ స్ధలం మీదుగా రోడ్డు వేయడాన్ని సంజీవయ్య పేద కూలీ సంఘంకు చెందిన 32 కుటుంబాల వారు వ్యతిరేకించారు. అయినప్పటికీ సంఘ అధ్యక్షుడు బండి సత్యనారాయణ ఆధ్వర్యంలో చర్చి స్ధలంలో ఉన్న ప్రహారీ గోడను కూల్చివేసారు. దీంతో గ్రామంలో శాంతి భద్రత సమస్యలు తలెత్తడంతో 2016 సెప్టెంబర్ 17వ తేదీన రావులపాలెం తహసీల్దారు కార్యాలయంలో అప్పటి తహసీల్దారు, సిఐ, మండల అధికారుల ఆధ్వర్యంలో ఇరువర్గాలతో శాంతి కమిటీ ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. రోడ్డు వేయడానికి ఇరువర్గాలు అంగీకరించడంతో సమస్య పరిష్కారం అయ్యింది. సమస్య పరిష్కారం అయినప్పటికీ అప్పటి నుండి 32 కుటుంబాలకు చెందిన తమకు సంఘ ఆదాయం చెందకుండా అడ్డుకోవడంతో పాటు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేసి కుల పెద్దలు తమను మానసిక వేదనకు గురుచేస్తున్నారంటూ ది 2020 మార్చి 6వ తేదీన తహసీల్దారు జిలానీ, ఎస్సై బుజ్జిబాబులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఇరు పక్షాల సమక్షంలో తహసీల్దారు, ఎస్సైలు విచారణ చేపట్టగా వీరిని సంఘం నుండి వెలివేయలేదని , సంఘ కార్యక్రమాలకు పిలుస్తామని అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పడంతో అధికారులు వెళ్ళిపోయారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం సంఘ పెద్దలు రామాలయం వద్డ సంఘానికి చెందిన సుమారు 15 ఎకరాల భూమి, కొబ్బరి చెట్లు లీజుకు ఇచ్చేందుకు పాటలు పెట్టగా పాడేందుకు వెళ్లిన తమను మీరు సంఘంలో లేరు, మీకు పాడేందుకు అవకాశం ఇచ్చేది లేదు అంటూ తిరస్కరించారు. దీంతో శనివారం తహసీల్దారు జిలానీ, రావులపాలెం పోలీసులకు ఈ విషయం పై ఫిర్యాదు చేశామని, విచారించేందుకు వచ్చిన అధికారులు కనీసం తమతో మాట్లాడకుండా వెళ్ళిపోయారని వాపోయారు. దీంతో  దిక్కుతోచని స్థితిలో ఆందోళన చేపట్టామని, సమస్యను పరిష్కరించడానికి వచ్చిన అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడి మేరకే వెనుదిరికి వెళ్ళిపోయారని ఆరోపించారు. పై అధికారులు కలుగజేసుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


పేదవాడికి సాయం చేయడ మే కనీస ధర్మం


పేదవాడికి సాయం చేయడ మే కనీస ధర్మం


 


 


సఖినేటిపల్లి, పెన్ పవర్..


 


ఎక్కడ పేదవాడు ఉన్న అతడికి మన వంతు సహాయ పడటం మనిషిగా కనీస ధర్మమని రామేశ్వరం మాజీ సర్పంచ్, విలేజ్ వెల్ఫేర్ ఫస్ట్ ఫౌండర్ చైర్మన సరెళ్ళ. విజయప్రసాద్ అన్నారు. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం లో గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామాల్లో ఉన్న నిరుపేదలైన వారికి బియ్యం, నగదు పంపిణీ సందర్భంగా ఆదివారం జరిగిన  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనెల 85 మంది నిరుపేదలకు బియ్యంతో పాటు వంద రూపాయల నగదు పంపిణీ చేశారు. గాడ్స్ వే ఆర్గనైజేషన్ ఆర్థిక సహాయం అందించిది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తెన్నేటి. బర్నబాస్, జాలెం.శ్రీను, కాండ్రేగుల. కృష్ణ, కట్టా. ఉమామహేశ్వరరావు, అల్లూరి. మధు రాజు, లచ్చి రాజు, వెంకటేష్, తోపాటు పలువురు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...