Followers

సొమ్ములు కేంద్రానివి,సోకులు రాష్ట్రానివి


 


సొమ్ములు కేంద్రానివి,సోకులు రాష్ట్రానివి


 


సఖినేటిపల్లి, పెన్ పవర్:


 


13 జిల్లాల తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ,జరుగుతున్న అభివృద్ధి పనులలో ఎక్కువ శాతం, కేంద్ర నిధుల తో అమలు జరుగుతు న్నా, అవన్నీ తామే చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ , రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం క్షమించరాని దని, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఉపాధ్యక్షులు మాలే. శ్రీనివాస నగేష్ ఆరోపించారు ఆదివారం సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం లో   జన జాగరణ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత చేసిన సంస్కరణలు, ప్రారంభించిన పథకాలు, సామాన్య ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు రాష్ట్రాలకు కేటాయించి, విడుదల చేస్తున్న, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు వీటి గురించి, ఎక్కడా ప్రస్తావించకపోవడం ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర పథకాల పేరు మార్చి, ప్రతిదానికి రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చి, సొంత పథకాలు గా రాష్ట్రంలో అమలు చేస్తు, విస్తృత ప్రచారం చేయడం ఎంతవరకు ధర్మం అని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం కోట్లాది రూపాయల నిధులను వివిధ పథకాలకు విడుదల చేస్తున్న, వాటి గురించి ఇప్పటి వరకు ,ఎక్కడా ప్రస్తావించకపోవడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాలకు ప్రధాని ఫోటో ఎక్కడ  ఉండకుండా శ్రద్ధ తీసుకొనే ముఖ్యమంత్రి, తనది, తన తండ్రి ఫోటోలు మాత్రమే వాటికి కూడా ఉంచి ప్రచారం చేయదాన్నీ ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇదే పద్ధతిని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆచరించి, తగిన మూల్యం చెల్లించుకుంది అని, జగన్ మోహన్ రెడ్డి కూడా గతి తప్పదని అని ఆయన జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి గణేష్ కళ్యాణ యజన పథకం ద్వారా ఈ ఏడాది నవంబర్ నెల వరకు ప్రతి ఒక్కరికి బియ్యము, పప్పు దినుసులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. కోట్లాది రూపాయలను ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కేంద్రములో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సామాన్య ప్రజలకు వాటి వివరాలు తెలియక పోవడం తమ పార్టీ పురోభివృద్ధికి కొడుకు లేదని ఆయన అన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 108 ,104 వాహనాలను ప్రతి మండలానికి కేటాయించడం జరిగిందని, వాటి కొనుగోలులో 40 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానీవే నని శ్రీనివాస్ నగేష్ చెప్పారు. ఈ విషయాన్ని దాచి పెట్టి ఈ వాహనాల తన సొంత నిధులతో ఉన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవాలని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ చేసిన అనేక పథకాల వివరాలను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెంపాటి. శివరామకృష్ణంరాజు, దంతులూరి. సీతారామరాజు, ఆకుల. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...