తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో నిత్యావసరాలు పంపిణీ
తాళ్ళపూడి,పెన్ పవర్:
తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో దాతలు ప్రతీ రోజు సాయం చేస్తున్నారు. ఈ విషయం వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకొని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న స్వర్గీయ రామిశెట్టి మధనగోపాలస్వామి గారి అబ్బాయి రామిశెట్టి అరవాలరాజు 100గ్రాముల టీ పొడి, కేజి పంచదార, అలాగే సిద్దంశెట్టి బాలాజీ వంకాయలు, బంగాళాదుంపలు, నిమ్మకాయలు, అల్లం, అరలీటర్ పెరుగు మాజీ సర్పంచ్ నామన పరమేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎల్లా కుమారస్వామి పాలు, మారిశెట్టి సూర్యచంద్రం గ్రుడ్లు, సిద్దంశెట్టి కృష్ణ, బండారు నాగేశ్వరరావు బిస్కెట్లు, కామిశెట్టి దుర్గారావు పెరుగు, మాంటిస్సోరి స్కూల్ అధిపతి పాలు, మాట్ల బ్రదర్స్ పాలు, కరిబండి విద్యాసంస్థలు ఆటా పిండి, ఎర్రనూక పంపిణీ చేశారు. ఈ దాతలకు కంటోన్మెంట్ జోన్లో ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment