ప్రజల ముంగిటకే పరిపాలన
-- జగన్ లక్ష్యమన ఎమ్మెల్యే అమర్
అనకాపల్లి, పెన్ పవర్
ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంకల్పమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఉన్న పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ ముందుకు సాగుతున్నారనారు. ఇదే లక్ష్యంతో సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో సచివాలయం 3, 4 లో నూతనంగా మంజూరు అయిన పెన్షన్లను శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ చేతుల మీదగా మంగళవారం లబ్దిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది అన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 500 కోట్లతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఆసుపత్రిని కూడా మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అనకాపల్లి కేంద్రంగా త్వరలో కొత్త జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామ రాజు, జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి, కొణతాల మురళీకృష్ణ ,యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment