నాటు సారాయి పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉక్కుపాదం.సి.ఐ. జి.వెంకట లక్ష్మి.
కాకినాడ స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్
మంగళవారం తెల్లవారుజామున స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ మరియు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ మండలం వకలపూడి గ్రామంలో పరిధిలో గల షిప్పింగ్ అర్బర్ వద్ద ఒక ఫైబర్ బోట్ లో నాటు సారాయి ని విక్రయిస్తున్న పలేపు వీరబాబు వయసు 24 సం. అను వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 150 లీటర్ల నాటు సారాయి ని,ఒక ఫైబర్ బోట్ ను స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ జి. వెంకట లక్ష్మీ (సెబ్) తెలిపారు. సందర్బంగా ఆమె సదరు ఘటనపై విచారణ చేయగా సదరు వ్యక్తి కి యానాం లో గిరియం పేటకు చెందిన పెసంగి రాముడు,అతని కుమారుడు పెసంగి సుందరరావు తనకు తరచుగా నాటు సారాయి ని సప్లయి చేస్తారని నేను దానిని విడి,విడి గా చేపల వేట చేసుకునే వారికి అమ్ముతాడని చెప్పారు. సి.ఐ.మాట్లాడుతూ ఇలాంటి కల్తీ,అక్రమ సారాయి ని సేవించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నిత్యం సముద్రం పై వేటకు వెళ్లే వారు అనేక ప్రమాదాలలో చిక్కుకుంటారని, తద్వారా మీకు కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేసిన వారవుతారని,ఎంతో కష్టమైన వేట సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎవరు కూడ అక్రమ మద్యం,సారాయి ని సేవించడం మంచిది కాదని, జాలర్ల కు హితవు పలికారు...అక్రమ మద్యం,నాటు సారాయి ని రవాణా,అమ్మకం,పై నిరంతరం నిఘా ఉంచుతామని,అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులలో సి.ఐ జి. వెంకట లక్ష్మి తో పాటు యస్.ఐ. కె. తమ్మరావు, సిబ్బంది టి.వెంకటేశ్వరవు, కృష్ణమోహన్,దొర తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment