Followers

 ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.


 ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.



ఎస్ ఐపై  చర్య తీసుకోవాలని  బైఠాయించిన ఆందోళనకారులు.



ఏ కోడూరు పోలీస్ స్టేషన్  వద్ద ఉద్రిక్తత.


విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్) 


 


పోలీస్  స్టేషన్లో  ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వి ఆర్ పి పై  ఎస్ ఐ     చేయి చేసుకున్నాడని   పలువురు  స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దౌర్జన్యంగా కొట్టిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని  నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే. జిల్లాలోని  కే కోటపాడు మండలం  ఏ కోడూరు  పోలీస్  స్టేషన్  వద్ద మంగళవారం తలెత్తిన సంఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎన్ఆర్ఈజీఎస్ లో  వి ఆర్ పి గా పనిచేస్తున్న  పాటూరి సింహాచలం నాయుడు స్థలం విషయంలో వేరే వ్యక్తి దౌర్జన్యం చేశాడని ఏ కోడూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలో ఎస్ ఐ నిలదీసి ఫిర్యాదు చేస్తావా అంటూ దుర్భాషలాడి తనను చితకబాదాడు  అని  ఆరోపించారు. ఈ పరిస్థితి చూసి  నా భార్య వరలక్ష్మి అడ్డుకునే ప్రయత్నం చేయగా  ఆమెను కూడా దౌర్జన్యంగా నెట్టేశారని  తమపై  దుర్భాషలాడారని  వారు పేర్కొన్నారు. బంధువులు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి  నిరసన తెలియజేశారు. టీడీపీ నాయకులకు  అనుకూలంగా పనిచేస్తున్న ఎస్ఐపై  చర్యలు తీసుకోవాలని  ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆందోళనకారులు అన్నారు. చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరణం ఈశ్వరరావు  సంఘటనా స్థలానికి చేరుకునిచ ఆందోళనకారులకు  నచ్చజెప్పడంతో  ఆందోళన విరమించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...