విశాఖపట్నం... పెన్ పవర్..
ప్రతి పేదకుటుంబానికి తమ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖ లా సన్స్ బే కాలనీ ఎంపీ పార్టీ ఆఫీస్ లో ఐదు కేజీల బియ్యం బస్తాలను బాబా బజార్ దరి పోలమాంబ ఆటో స్టాండ్ లో ఉన్న 200 మంది ఆటో డ్రైవర్స్ కు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా
ఎంపీ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో తమవంతుగా ఇతోధిక సాయం చేస్తున్నామన్నారు .ఇప్పటికే ఆటో వాలాలకు జగన్ ప్రభుత్వం పలు పధకాలను ప్రవేశ పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు .
No comments:
Post a Comment