Followers

విద్యుత్ ఛార్జీల మోత పెను భారమే


విద్యుత్ ఛార్జీల మోత పెను భారమే

 

అనకాపల్లి , పెన్ పవర్

 

ముాలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా రాష్ట్రంలో విద్యత్ చార్జీల మోత  ప్రజలపై పెను భారం మెాపిందని అనకాపల్లి అసెంబ్లీ నియెాజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఐ.ఆర్.గంగాధర్ విమర్శించారు.గురువారం గాంధీనగర్  లో  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు నెలలుగ  స్వీయ నిర్బంధంలో ప్రజలు ఉంటు జీవనోపాధి లేక   అల్లాడుతున్నారని అన్నారు.ఈ  పరిస్థితిలో రెండు నెలల రీడింగ్ సేకరించటం ద్వారా అధిక మెుత్తంలో విద్యుత్ చార్జీలు వసుాలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని  గంగాధర్ అన్నారు.విద్యుత్ చార్జీల పెంపు పై పునరాలోచన చేయాలని కోరారు. లాక్ డౌన్ విధించిన నాటి నుండి ఇంటికే పరిమితమైన రోజువారీ కుాలీలకు,చిరు వ్యాపారులకు కుటుంబానికి 10 వేల రుాపాయలు చొప్పున కరువు భృతి చెల్లించాలని గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.పేదల అద్దె ఇంటి బకాయలను కుాడ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని కోరారు.ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ తుట్టా రమణ,జిల్లా యుాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...