76 వార్డు లో కొనసాగుతున్న కాయగూరలపంపిణీ





గాజువాక :

 

కరోనా మహమ్మారి ప్రజలెవ్వరికి సోకకుండా అహర్నిశలు కష్టపడి శానిటరీ సిబ్బంది అందిస్తున్నా సేవలకు నియోజక వర్గ ప్రజలందరి తరుపునుండి పేరుపేరున ప్రతి ఒక్క శానిటరీ సిబ్బందికి హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు . గురువారం జీవీఎంసి 76 వ వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో పెదగంట్యాడ డంపింగ్ యార్డులో విధులు నిర్వహిస్తున్న సుమారు 150 మంది శానిటరీ సిబ్బందికి అలాగె వార్డులో విధులు నిర్వహిస్తున్న శానిటరీ సిబ్బందికి కాయగూర్ల పంపిణి చేపట్టారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపి జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు తిప్పల వంశిరెడ్డి పాల్గొని కార్మికులకు కాయగూరలు పంపిణి చేశారు . ఈ సంధర్భంగా వంశీరెడ్డి మట్లాడుతూ ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ కరోనా రక్కసినీ నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ స్వీయనిర్బంధం పఠించాలని చెప్పేరు . అత్యవసర సమయంలో బయటకి వస్తే తప్పనిసరిగ మాస్క్ లు ధరించి  భౌతిక దురాన్ని పఠించాలని కోరారు . ఇటువంటి క్లిష్టపరిస్థులలో వార్డు ప్రజలకు అండగ నిలిచి సహాయసహకరాలందిస్తున్న దొడ్డి రమణను అభినందించారు . దొడ్డి రమణ మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల వార్డులో ప్రజలెవ్వరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సుమారు నెల రోజులనుండి వార్డులో ఉన్న అన్ని కోలనీలలో గడపగడపకు వెల్లి నిత్యవసర సరుకులు , బియ్యం , కూరగాయలు అందిస్తున్నామని చెప్పేరు . ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఎస్ ఎస్టి అధ్యక్షుడు మార్టిపూడి పరదేశి , నక్క వెంకటరమణ,పిట్టా రెడ్డి నాగార్జన్,రాజు,తాటికొండ అచ్చత్,కాకినాడ పెంటరావు,ములకలపల్లి వెంకటేష్,నాని,బాలాజీ, అండిభోయిన సన్నీ,ఎస్.ఆనంద్,బాబురావు,సంతోష ,సానిటర్ సుపర్వేజర్ నరిసింగరావు తదితరులు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు