Followers

మన్యంలో  మారని  డోలీల మోత.


మన్యంలో  మారని  డోలీల మోత.



రోడ్లు మృగ్యం.. ఆదివాసీలకు ప్రాణసంకటం.



  ప్రభుత్వాలు మారుతున్న ఇక్కడ మారని దురాచారం.


 


           స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్) 


మన్యంలో  డోలీలు మోత  ఆచారం లా మారిపోయింది.  ఎక్కడ ఎవరికి  అనారోగ్యం  చేసిన  ప్రాణాపాయ స్థితిలో   ఉన్నా   వైద్యం కోసం తరలించాలి అంటే  డోలిలో మోయాల్సిందే.కొండల కోనల మధ్య  మైళ్ల దూరం మోసుకొని ని  ఆస్పత్రులకు  చేరవేస్తున్నారు. సకాలంలో  వైద్యం అందితే  ప్రాణాలు  నిలిచినట్టే  లేకుంటే  గాలిలో కలిసి పోవడమే.  స్వాతంత్రం  వచ్చి  73  వసంతాలు  కావస్తున్నా  శివారు గిరి పల్లెల్లో  డోలీల దురాచారం  ఇంకా మారలేదు. రోడ్లు లేకపోవడంతో  ఆ గ్రామాల్లో ప్రజలకు  జ్వరం జబ్బు   వచ్చిన  గర్భిణీ  పురిటి నొప్పులు తలెత్తిన  ఉచిత వైద్యం అందుకోవాలంటే  రోగిని  డోలి లో  ఆసుపత్రికి తీసుకు రావాలి.  వైద్యులు అందుబాటులో ఉంటే  సకాలంలో వైద్యం ఉంటుంది  లేకుంటే లేదు. ప్రభుత్వాలు మారుతున్నా యి   గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని  ఎన్నికల్లో  ప్రకటనలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల కేటాయించిన నిధులు  ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రతి మండలంలో వందల సంఖ్యలో శివారు గ్రామాల ప్రజలు  రోడ్డు మార్గం లేక  కొండలు పొదలు  నడుచుకుంటూ  కాలం వెళ్లదీస్తున్నారు. ఆ గ్రామాల వైపు  చూస్తే   హృదయ  విదారక  సంఘటనలు  కంట పడతాయి. హుకుం పేట  మండలం  తీగ వలస పంచాయితీ పనస బంధ గ్రామంలో శుక్రవారం రాత్రి చీదరి  చిలకమ్మ  ఆదివాసి మహిళ  గర్భిణీ నొప్పులు మొదలై  ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వైద్య సిబ్బంది కూడా  అందుబాటులో లేకపోవడంతో  పాలుపోని గ్రామస్తులు ప్రసవ వేదన అనుభవిస్తున్న చిలకమ్మ ను డో లీపై  కొండలపై నుంచి నాలుగు కిలోమీటర్లు మూసుకొని రోడ్డు వద్దకు చేర్చారు  అక్కడ నుంచి హుకుం పేట  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. జి.మాడుగుల మండలం లువ్వాసింగ్ పంచాయతీ  వంచేబు బిడ్డ పుట్  గన్నె గుంట 11 గిరిజన గ్రామాలు రోడ్డు సౌకర్యం లేక  కొండల పైనుంచి నడుచుకొని రావాల్సిందే. ఆనారోగ్యానికి గురైతే డోలీలపై  మోసుకు రావాల్సిందే. ఏళ్ల తరబడి అక్కడి గిరిజనుల్లో  రోడ్లు నిర్మించాలని  నాయకులను అధికారులను కోరుతున్నారు అయినా ఆ గ్రామాలకు మోక్షం కలగలేదు. ప్రతి ఏడాది పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు  ఇతర నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది  శివారు గ్రామాలకు అంచెలంచెలుగా  రోడ్ల నిర్మాణం చేపడితే డోలీ  మోత దురాచారం  సమసి పోతుందని  ప్రజా సంఘాలు  మోర పడుతున్నాయి. నింగికి రాకెట్లను పంపుతున్న కాలంలో కూడా  గిరిజనులుగా పుట్టిన పాపానికి  ఇంకా  డోలీల నే  ఉపయోగిస్తున్నారు అంటే  అభివృద్ధి  స్పష్టమవుతోంది.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...