-- మాజీమంత్రి దాడి వీరభద్రరావు
అనకాపల్లి, పెన్ పవర్
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస పోతున్న కార్మికుల అవస్థలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది అని మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై అష్టకష్టాలు పడుతూ వెళ్తున్న కూలీలకు ఆహారాన్ని అందించే చర్యలు మంత్రులు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ సౌకర్యం కల్పించడంతో పాటు వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ ఆహార శిబిరాలు ఏర్పాటుచేసి కూలీలకు ఆకలి బాధలు తీర్చాలని అన్నారు. రోజుల తరబడి ఆహారం తినకుండా ఆకలి బాధతో నడిచి వెళ్తున్న వారి బాధలు వర్ణనాతీతం అన్నారు. అంతకు ముందు ఆర్డీవో సీతారామారావును కలిసి మాట్లాడారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఒరిస్సాకు చెందిన ఇటుక బట్టి కూలీలు వేలల్లో ఉన్నారని వారిని గుర్తించి వారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీశెట్టి కృష్ణ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment