టీడీపీ దుకాణం మూసే సమయం దగ్గరపడింది
బ్యూరో రిపోర్ట్ విశాఖపట్నం, పెన్ పవర్
టీడీపీ కాస్త జూమ్ పార్టీ గా తయారైందని త్వరలోనే టీడీపీ పూర్తి స్థాయి లో ఏపీ లో మూత పడుతోందని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కి పబ్లిసిటీ వద్దు. పని మాత్రమే కావాలి. కరోనా తో సహ జీవనం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి తొలి రోజుల్లో నే చెబితే దానిని కూడా టీడీపీ నేతలు వెటకారంగా విమర్శించారు. ఇప్పుడు దేశంలో వున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తో పాటు దేశ ప్రధాని కూడా సహజీవనం చేయాలని చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఈ విషయమై ఏమి సమాదానం చెబుతారు. కరోనా వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి,రైతులు సంక్షేమం తదితర అన్ని అంశాలు లో మిగతా రాష్ట్రాల కంటే ఏపీ నే ముందు గా శ్రద్ధ తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ముందు చూపు తోనే ఇది సాధ్యమైంది. బాదితులను కొన్ని చానల్స్ ప్రేరేపించి మాట్లాడించే పరిస్థితి ఎందుకు అని విమర్శించారు. ప్రజల లో భయం సృష్టించే ప్రయత్నం చేయడం తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫాలీమార్స్ కంపెనీ అక్కడ వుండాలా వద్దా అనేది టీడీపీ నేతలు స్పష్టం గా చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ పట్నం లో పంచ భూతాలు ని సైతం టీడీపీ నేతలు దోచుకున్నారు. వైసిపీ వారికి అలాంటి అవసరం లేదన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ని ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు వైసిపీ పై విమర్శలు చేయడం సరి కాదన్నారు. ఎల్జీ ఫాలీమార్స్ వంటి పెద్ద దుర్ఘటన జరిగితే టీడీపీ నేతలు ఎక్కడున్నా రు. బాద్యత లేదా?ప్రాణ భయం తో కరోనా కు భయపడి ఇళ్ళ లో కూర్చుని స్టేట్ మెంట్ లు ఇస్తే తాము స్పందించాలా?రాష్ట్రం లో టీడీపీ పూర్తి స్థాయి లో కనుమరుగై పోయింది. టీడీపీ కేవలం జామ్ పార్టీ గా మాత్రమే మిగిలి పోయింది.
రాష్ట్ర దేశ వ్యాప్తంగా కరోనా తో పోరాటం చేస్తుంది. ఫాలీమార్స్ ఘటన బాధాకరం. దుర్ఘటన తెలిసిన తక్షణమే జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ప్రజల ని రక్షించేందుకు,ఆందోళన తగ్గించేందుకు కృషి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విశాఖ చేరుకుని అధికారులు ని అప్రమత్తం చేశారు. మంత్రులు ని ఫాలీమార్స్ బాదిత గ్రామాల లో పర్యటించమని ఆదేశాలు ఇచ్చారు. నష్టపరిహారం ప్రకటన చేశారు. ఫాలీమార్స్ బాదిత గ్రామాల లో సాదరణ పరిస్థితి నెలకొల్పేలా చర్యలు తీసుకున్నాం. అదే గ్రామాలలో మంత్రులు బస చేశాం. అవగాహన లోపంతో కొంత మంది కి లక్ష కాకుండా తక్కువ ఇవ్వడం ని సరిచేశాం. అర్హత కలిగిన బాదితులందరికీ జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లింపు చేస్తున్నాం.ప్రతి ఒక్కరికి పది వేలు రూపాయలు పంపిణీ చేస్తున్నాం. అయిదు గ్రామాల ప్రజలే కాకుండా వేరెవ్వరైనా బారిన పడితే వారి వివరాలు కూడా సేకరిస్తున్నాం. ప్రతి పక్ష పార్టీ లు,అనుబంద మీడియా సంస్థలు,వారి కి వంత పాడే వారి మూర్ఖత్వాన్ని మార్చలేం.టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తన పై తప్పు డు ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. జగన్మోహనరెడ్డి ఫాలీమార్స్ ప్రతినిధులు తో విమానాశ్రయం లో ఏకాంతం గా మాట్లాడారనడం సబబు కాదు అని అన్నారు.
Attachments area
No comments:
Post a Comment