మెరకముడిదాం అధికారుల కష్టం వృధా అవుతుందా?
మెరకముడిదాం , పెన్ పవర్ :
మార్చి 23 నుంచి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచి ప్రజల నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో వైద్య ,ఆరోగ్యశాఖ ,పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ,పారిశుద్ధ్య సిబ్బంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛంద సేవా ప్రతినిధులు ఎంత మొత్తుకున్నా ఇప్పటికీ 90% ప్రజల్లో మార్పు రాలేదు అని చెప్పవచ్చు.అవసరం ఉన్నా లేకపోయినా రోడ్లమీద తిరగడం మాస్కులు పెట్టుకోకపోవడం సామాజిక దూరం పాటించకపోవడం గుంపులు గుంపులుగా మీటింగ్ పెట్టడం జరుగుతుంది.మరికొంతమంది అయితే రకరకాల ఆటలు ఒకే దగ్గర చేరి కాలక్షేపం చేస్తూ మెరకముడిదాం అధికారుల కష్టాన్ని గుర్తించడం లేదు. మనం బాగుండాలని మన కుటుంబాలు బాగుండాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ఇతరులు ఎంత కష్టపడుతున్న ప్రజలకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో చలనం రాలేదు అని చెప్పవచ్చు.ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే అధికారులు ఇంకా ప్రజలకు అవగాహన కల్పించే అవసరం ఉండదు.ఎప్పటికైనా ప్రజలు మారి ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి సహకరిస్తే కనీసం ఈ నెల చివరి కైనా పూర్తిగా జూన్ మొదటి నుంచి ఎవరి పని వారు చేసుకునే అవకాశం ఉంటుంది.లేకుంటే మరో ఆరు నెలల పాటు ఇదే విధానం కొనసాగి జీవనోపాధి కోల్పోయే ఎందరో పేదల ఆకలి చూడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మారుద్దాం జాగ్రత్తలు పాటిద్దాం.
No comments:
Post a Comment