Followers

ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకోలు


 



వలస కార్మికుల విషయంలో స్వార్ధ రాజకీయ నాయకులు ఏమైపోయారు??

 

 

స్వస్థలాలకు చేర్చేందుకు స్వార్ధ రాజకీయ నాయకులు ఏమైపోయారు?

 

మండుటెండలో కాలినడకన, సైకిళ్లపై వందల కిలోమీటర్ల ప్రయాణం

 

ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకోలు

 

విజయనగరం  ప్రతినిధి ,  పెన్ పవర్ :

 

లాక్‌డౌన్‌ దెబ్బకు వలస కార్మికుల బతుకులు రోడ్డునపడ్డాయి. స్వస్థలాలకు వెళ్లేందుకు వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. జాతీయ రహదారుల వెంబడి మండుటెండను సైతం లెక్కచేయకుండా కాలినడకన కొందరు, సైకిళ్లపై మరికొందరు తమ సొంత రాష్ట్రాలకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను చూసేవారి హదయాలను కలచివేస్తున్నాయి. రోజు వారీ వార్తలు టీవీ లో చూస్తున్నాం, పెయింటింగ్‌ పనుల నిమిత్తం ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన వలస కార్మికులు  చింతలపూడి నుంచి కాలినడకన విజయవాడ బయలుదేరారు. విజయవాడ చేరుకుంటే అక్కడి నుంచి రైలులో ఉత్తరప్రదేశ్‌ వెళ్లేందుకు అనుమతి దొరుకుతుందనే ఆశతో బయలుదేరిన ఆ బృందం మంగళవారం మధ్యాహ్నం ఏలూరు నగరంలోని సిఆర్‌.రెడ్డి కళాశాల వద్ద ఓ చెట్టు నీడలో భోజనం చేస్తూ కనిపించారు. అలాగే జార్ఖండ్‌కు చెందిన రైల్వే కంకర పనులు చేసే ఐదుగురు కార్మికులు చెన్నై నుంచి సైకిళ్లపై జార్ఖండ్‌కు వెళుతూ బైపాస్‌ రోడ్డులో ఓ చెట్టు కింద నిద్రపోతూ కనిపించారు. 12 రోజుల క్రితం సైకిళ్లపై చెన్నై నుంచి బయలుదేరినట్లు వారు తెలిపారు. వారిపక్కన ఉన్న భోజనం ప్యాకెట్లను చూస్తే సైకిల్‌ తొక్కి అలసిపోయి, భోజనం తినకుండానే పడుకున్నట్లు తెలుస్తుంది. అలాగే తమిళనాడులోని టైర్ల కంపెనీలో పనిచేసే ఓ ఇద్దరు వలస కార్మికులు సొంత రాష్ట్రం చేరాలనే పట్టుదలతో ఏకంగా రెండు కొత్త సైకిళ్లను కొనుగోలు చేసి ఒరిస్సా బయలుదేరారు. వారు కూడా జాతీయ రహదారిపై ఆశ్రం ఆసుపత్రి సమీపంలో ఓ చెట్టు నీడన భోజనం చేస్తూ కనిపించారు. ఐదు రోజుల క్రితం చెన్నై నుంచి బయలుదేరామని వారు తెలిపారు. ఇలా ఎక్కడ చూసినా వలస కార్మికుల వెతలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటివారిని సొంత రాష్ట్రాలకు పంపించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఓ పక్క ప్రభుత్వాలు చెబుతుంటే సొంత రాష్ట్రాలకు చేరేందుకు కార్మికులు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బతుకు భారమై ఉన్న సొంత ఊరిని సొంత జిల్లాను వదిలి పక్క రాష్ట్రానికి పక్క జిల్లాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి చూస్తే కన్నీరు వస్తుంది.పిల్లలను కన్న తల్లి దండ్రులు, అత్తమామలు ను వదిలి కడుపు నింపుకోవడానికి ఆ కుటుంబం కడుపు నింపడానికి పిల్లల జీవితాలు బాగుపడాలని ఆశతో వలస కార్మికులకు కష్టకాలంలో ఓట్లు అడిగే వాళ్ళ పై ఆధారపడి బతికే స్వార్థ రాజకీయ నాయకులకు గుర్తు రాలేదని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికులు ఓట్లు కావాలంటే మాత్రం ప్రత్యేకమైన బస్సులు కార్లు లో సొంత ఊర్లకు తీసుకు వస్తారు కానీ నీ కరోనా కష్టకాలంలో ఫోన్ చేసి వారి బాగోగులు అడిగిన ఒక్క నాయకుడు కూడా లేడు. అమాయక ప్రజల అమాయకత్వంతో స్వార్ధ రాజకీయ నాయకుల ఆలోచనతో వాళ్ళని మోసగించి వాళ్ళు వేసే ఓట్లతో కేవలం బతికే నాయకులు కనీసం మేము గుర్తు రాలేదని ఓట్లు వేసే వలస కార్మికులు చీదరించుకునే పరిస్థితి.అదే నాయకుల పిల్లల కానీ, బంధువుల కానీ ఎక్కడైనా ఉంటే తీసుకువచ్చే వీరు మాపై ఇంత వివక్షత చూపించడం చాలా దారుణమని వలస కార్మికుల తో చేసిన సంభాషణలో వలస కార్మికులు రాజ్ కుమార్ తో చెప్పడం జరిగింది.కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటూ వస్తున్న వారిని మాత్రం స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకుని వాళ్ళ ఆకలి తీరుస్తూ వారి దాహాన్ని తీరుస్తూ వారు ఇచ్చిన మనోధైర్యంతో  ముందుకు నడిచేలా చేశాయని వలస కార్మికులు చెప్పుకొచ్చారు.కొంత మంది దగ్గర లాక్ దాని మొదలు తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ల దగ్గర ఉన్న సొమ్మ తో తాము తెచ్చుకొని తిన్నామని ఆ తర్వాత డబ్బులు అయిపోయాయి అని వలస  ప్రాంతంలోనే ఉంటే తన పరిస్థితి ఏ విధంగా మారుతుందో తెలియని పరిస్థితిలో కనీసం కష్టకాలంలో సొంత ఊర్లకు పోదామంటే సరిపడా డబ్బు లేని పోనీ పరిస్థితి, పనిచేసిన కాంట్రాక్టర్ ను అడిగితే వాళ్లు కూడా చేతులెత్తేసిన పరిస్థితి, కాలినడకన నడవలేని పరిస్థితి అదే విధంగా లారీలకు అధిక సంఖ్యలో సొమ్ము చెల్లించుకో లేని పరిస్థితి లో కనీసం స్వార్ధ రాజకీయ నాయకులు ఆలోచించక పోవడం చాలా దారుణమైన విషయమని వలస కార్మికులు రాజ్ కుమార్ తో చేసిన సంభాషణల్లో పేర్కొన్నారు.ఏది ఏమైనా బతుకుబండిని లాగించడానికి  పోయిన వలస కార్మికుల ఓట్ల పై ఆధారపడి బతికే స్వార్థ రాజకీయ నాయకులారా  మీరు మారకుంటే ప్రభుత్వాలకు ప్రమాదం ఉంది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వలస కార్మికుల రాకపోకలపై వాళ్ళ జీవన పరిస్థితులు వారి బాగోగులు ఎంతైనా విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని వారి కష్టాలను తీర్చుకుంటే ప్రభుత్వాలు ప్రమాద బారిన పడే అవకాశం లేకపోలేదు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...