మన్యంలో మసకబారుతున్న ప్రేమ(లు)
ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువత.
మోజు తీరాక ఎడమొహం పెడమొహం.
పోలీసులను ఆశ్రయిస్తున్న యువతులు.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
మన్యంలో ప్రేమ(లు) మసకబారుతున్నయి. ఆకర్షణకు లోనైన యువతీ యువకులు చెలిమి చేస్తున్నారు ప్రేమ అనే మైకం లో మోజు తీరాక ముఖం చాటేస్తున్నా సంఘటనలు లేకపోలేదు. అవగాహన లోపంతో మోసపోయి తేరుకున్న యువతులు పోలీస్ స్టేషన్ లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మౌనపోరాటానికి సై. అంటున్నారు. కొయ్యూరు నాతవరం జీకే వీధి హుకుం పేట మండలాల్లో యువతీ యువకుల ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి రోడ్డున పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కొయ్యూరు మండలం సింగందొర వాడు గ్రామానికి చెందిన కొర్రూ లోవ లక్ష్మి నాతవరం మండలం ఎర్ర కంపాడు మూల పర్తి వరప్రసాద్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. లక్ష్మీ పెళ్లి పేరు ఎత్తడం తో ప్రసాద్ మొహం చాటేశాడు. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితురాలు కొయ్యూరు పోలీసులను ఆశ్రయించింది. ఎస్ ఐ దాసరి నాగేంద్ర తన శైలిలో పెద్దల సమక్షంలో లోవలక్ష్మి ప్రసాదల పెళ్లి జరిపించారు. గూడెంకొత్తవీధి మండలం దామునా పల్లి పంచాయితీ గొడుగు మామిడి గ్రామంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న భీమరాజు హుకుంపేట మండలం గుచ్చరి గ్రామానికి చెందిన యువతిని ప్రేమ లో పడేశాడు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు మోజు తీరాక మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరిన పట్టించుకోలేదు. ఇటీవల వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకొని మోసపోయానని భావించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడు పై కేసు నమోదు చేయడంతో అధికారులు రాజును సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు గిరి ప్రాంతంలో అక్కడక్కడ వెలుగు చూస్తున్నయి. స్వచ్ఛమైన మనసు కలిగిన యువత ఆకర్షణ మోజులో పడి ప్రేమకు గ్రహణం పట్టిస్తున్నారని సంఘటనలు నిర్ధారిస్తున్నాయి.అవగాహన లేక యువకులు కేసుల్లో ఇరుక్కుంటున్ననారు.
No comments:
Post a Comment