Followers

Showing posts with label EMPLOYMENT & BUSINESS NEWS. Show all posts
Showing posts with label EMPLOYMENT & BUSINESS NEWS. Show all posts

శిక్షణ పూర్తి అయిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

 శిక్షణ పూర్తి అయిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

 ఎటపాక, పెన్ పవర్

ఎటపాక మండల కేంద్రంలో వృత్తి  నైపుణ్య శిక్షణ కార్యక్రమం భాగంగా శిక్షణ పూర్తి అయిన మహిళలకు చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆకుల.వెంకటరమణ చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐటీడీఏ పీవో మాట్లాడుతూ...ఐటీడీఏ చింతూరు,ఏపీ.ఎస్.ఎస్.డిసి  మరియు శ్రీ భవిత ఎడ్యుకేషనల్ సిల్క్ డెవలప్మెంట్ సొసైటీ వారు  ఎటపాక వై టి సి లో నిర్వహించిన  అసిస్టెంట్  ఫ్యాషన్ డిజైనింగ్  పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు 29  కుట్టుమిషన్లు అందజేశారు  ఇందులో భాగంగా ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ డిజైన్ కు అత్యంత ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు  యువత వృత్తి నైపుణ్య  కోర్సు నేర్చుకుని జీవితంలో ముందుకు సాగాలని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా సిల్క్ డెవలప్మెంట్ అధికారి.హరి శేషు,ఎటపాక వై టి సి మేనేజర్ శేఖర్ ముల్లి  తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ ఉపాధ్యాయులకు సర్కార్ భరోసా

 ప్రైవేట్ ఉపాధ్యాయులకు సర్కార్ భరోసా

మండల తహసీల్దార్ రాజ్ కుమార్

లక్షెట్టిపెట్, పెన్ పవర్

రాష్టంలోని అన్ని  విద్యాసంస్థలు  మూతపడడంతో  ప్రైవేట్ పాఠశాలలో  విద్యను బోధించే ఉపాద్యాయులు అర్ధాకాలితో బాధపడుతున్న విషయం గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని మండల తహసీల్దార్ రాజు కుమార్ అన్నారు.గురువారం పట్టణంలోని రేషన్ దుకాణాల వద్ద ప్రైవేట్ ఉపాధ్యాయులకు 25కిలోల సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని  మండల విద్యాధికారి రవీందర్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ  మానవీయ దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్టంలోని ప్రైవేట్ పాఠశాల లోని సిబ్బందికి 25 కిలోల సన్న బియ్యంతో పాటు రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం హర్షణీయం దగ్గర విషయమని తెలిపారు.దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అర్ధాకలితో అలమటిస్తున్న ప్రైవేట్ పాఠశాలల సిబ్బందిని ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా నాయకులు చంద్రశేఖర్, వై,శ్రీనివాస్ తో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

మన ఉద్యోగాలు మనకే.

 మన ఉద్యోగాలు మనకే. 

 మంచిర్యాల , పెన్ పవర్

ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క &సుమన్ గారి ఆదేశాల మేరకు.. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువకులకే దక్కే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన శుభ సందర్భంగా  చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండల కేంద్రాలు, మూడు మున్సిపాలిటీలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం, కార్యకర్తలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త జోనల్ వ్యవస్థ పై రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వడం వల్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా ఉద్యోగ నియామకాలకు అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా మెజారిటీ ఉద్యోగాలు స్థానికుల పొందే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కెసిఆర్ గారి వెంటే  నిరుద్యోగులు, యువకులు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం చేస్తూ త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలలో టిఆర్ఎస్వి, టీఆర్ఎస్ వై, కౌన్సిలర్లు, యువ నాయకులు యువకులు పాల్గొన్నారు.

.ఉద్యోగాలు సాధించిన ఆస్పరెన్స్ అకాడమీ విద్యార్థులు

ఉద్యోగాలు సాధించిన ఆస్పరెన్స్ అకాడమీ విద్యార్థులు

మంచిర్యాల,  పెన్ పవర్

ఇటీవలే విడుదలైన సింగరేణి ఉద్యోగా ఫలితాల్లో స్థానిక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పరెన్స్ అకాడమీ నుండి 05గురు విద్యార్థులు ఉద్యోగులుగా ఎంపికైనారు. విజయం సాధించిన వారిలో ఎస్.రాజకుమార్,ఎస్.వినోద్ కుమార్,ఎం.శ్రీధర్, వి.సతీష్ కుమార్,జి.శరత్ కుమార్ లు ఉన్నారు.వీరిని శాలువతో సన్మానించారు. తొలి ప్రయత్నంలొనే విజయం సాదించడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపికైన వారు పేర్కొన్నారు. సామాజిక సేవ అనే ఆంశంతో,పేదలకు కోచింగ్ ఇవ్వవడానికే ఆస్పరెన్స్ అకాడమీ ఉందని  డైరెక్టర్ నిహార్ వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పరెన్స్ అకాడమీ డైరెక్టర్ నిహార్ వర్మ, ఉపాధ్యాయులు శ్రీకాంత్, సాయి కృష్ణ, గోపి, వేణు, రవీందర్ లు మరియ విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాధి పనులు పరిశీలన

ఉపాధి పనులు పరిశీలన

తాళ్ళూరు,పెన్ పవర్

తాళ్లూరు మండలంలో ప్రతి ఒక్కరికి వంద రోజుల ఉపాధి పనులు కల్పించాలని ఎంపీడీవో  కేవీ కోటేశ్వరరావు అన్నారు. మండలం లోని తూర్పు గంగవరం గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ మొదలైందని,కూలీలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించాలని అన్నారు. కూలీలు ఇచ్చిన కొలతలు ప్రకారం పని చేస్తే వారికి రోజుకు  250 రూపాయలు కూలీ వస్తుందన్నారు.కూలీలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఫిల్డు అసిస్టెంట్ కు సూచించారు.ఆయన వెంట ఈసీ ప్రసాద్,టీఏ, ఎఫ్ఏ ఉన్నారు.

ఆదిత్య బిజినెస్ స్కూల్ లో "స్టాక్ మార్కెట్" పై సదస్సు

  ఆదిత్య బిజినెస్ స్కూల్ లో "స్టాక్ మార్కెట్"  పై  సదస్సు




  గండేపల్లి పెన్ పవర్

  గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ నందుస్టాక్ మార్కెట్   పై వర్చువల్ మోడ్ లో అవగాహనా సదస్సు  నిర్వహించినట్లు డైరెక్టర్ డా. ఎన్.సుగుణారెడ్డి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో షైన్ ప్రాజెక్ట్స్ సంస్థ నిర్వాహకులు "శ్రీహర్ష"గారు  ఆన్ లైన్ ద్వారా విద్యార్థులలో అవగాహనా కల్పించినట్లు ఆమె  తెలియజేసారు. ఈ సందర్భంగా శ్రీ హర్ష ఆన్ లైన్ ద్వారాసదస్సులో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూఅభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ముందువరుసలో ఉందని,అలాగే దేశంలో పెట్టుబడిదారులు అత్యధికులు స్టాక్ మార్కెట్ నందు పెట్టుబడులు పెడుతున్నారని,తద్వారా వారు మెరుగైన లాభాలను పొందుతున్నారని తెలిపారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె విధానం స్టాక్ మార్కెట్ పై విద్యార్థులకు క్షుణ్ణంగా ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ద్వారా  వివరించారు. మనదేశ స్టాక్ మార్కెట్ లో ముఖ్యమైన బి.ఎస్.ఇ,(బొంబాయిస్టాక్ ఎక్స్చేంజి)మరియు ఎన్.ఎస్.ఇ,(నేషనల్ స్టాక్ఎక్స్చేంజి)లలోవాటాదారులు వాటాలను కొనుగోలు మరియు అమ్మకం పద్దతులను గురించి వివరించారు. విద్యార్థులు స్టాక్ మార్కెట్ లో కొనుగోలు(ఇన్వెస్ట్) మరియు అమ్మకం ద్వారా లాభాలు (రిటర్న్స్)ఆర్జించడం ఎలా అనే  విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.డా. సుగునా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రపంచంలో జరిగే ఇతర విజ్ఞానదాయకమైన వ్యాపారాత్మక అభివృద్ధి పై కూడా ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని అందుకే ఆదిత్య విద్యార్థి సర్వతో ముఖాభివృద్దికి ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. విజ్ఞాదాయకంగా జరిగిన  ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.డి.ఆస్ధాశర్మ, డా. ఎన్.విశాలాక్షి,  ఉపాధ్యాయ సిబ్బంది, బి.బి.ఏ,మరియు ఎం.బి.ఏ విద్యార్థులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ ఆకలి కేకలు

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ ఆకలి కేకలు......

 

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

రాష్ట్ర వ్యాప్తంగా 3729 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ , ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం వీరి సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేది. గడిచిన సంవత్సరం నుండే 10 రోజుల వ్యవధి తో 12 నెలలకు జీతాలు వొచ్చెల ఇప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జీవితంలో ఆనందం వెరిసింది.  దీని ప్రకారం ఈ సంవత్సరం ఏప్రియల్ 1 తేదీ నుండి వీరి సేవలు పునారుర్దింపబ డాలి. కానీ దీని నిమిత్తం ప్రభుత్వం నుండి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.  జీతాలు లేక కుటుంబ పోషణ కు ఒప్పంద గురువులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పంద అధ్యాపక సంగం పిలుపు మేరకు ప్రస్తుత సమస్యలు తెలిపేందుకు విద్యాశాఖ మంత్రి శ్రీ. ఆదిములపు సురేష్ మెయిల్ కు ప్రతీ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆర్జీ ని ఈ రోజు పంపారు.మరి కొంత మంది 1902కి ఫోన్ చేసి సమస్య వివరించారు. ఇందులో నాన్ సంక్షన్ లో పని చేసే అధ్యాపకులకు దాదాపుగా 8నెలల నుండి జీతాలు లేదు. వీరి సమస్యలు తొందరగా పరీక్షించాలని ప్రభుత్వాన్ని,  ప్రభుత్వ ఒప్పంద అధ్యాపకుల సంగం వినయ పూర్వకం గా కోరుతున్నది. కరోనా నేపధ్యం లో పరిస్తితి ని అర్దం చేసుకొని ఒప్పంద అధ్యాపకుల ఆకలి తీర్చమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కార్మిక చట్టాల మార్పుపై నిరసన

 



 


 


 నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు


కార్మిక చట్టాల మార్పుపై నిరసన


పెనవర్, భీమవరం:


 


కరోనా, లా డౌన్లలో ఉద్యోగులు, కార్మికులు అవస్థలు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం, పనిగంటలను పెంచడం వంటి విధానాలతో సందిట్లో సడేమియా అంటూ ప్రజలపై విరుచుకు పడుతున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం స్థానిక మావుళ్ళమ్మ గుడి రోడ్డులో భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కాలానికి వేతనాలు ఇవ్వడానికి, కనీస వేతనాల అమలుకు, మనస్సులేని పాలకులు దొడ్డి దారిన కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నారని అన్నారు. లా డౌన్లో ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందిస్తున్న ఆశ, అంగన్‌వాడి, గ్రామ వాలంటీర్, మున్సిపల్ కార్మికులకు అదనంగా చేసేందేమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు బి.వాసుదేవరావు మాట్లాడుతూ ప్రాణాంతక కరోనాతో పోరాడుతూనే ఉద్యోగ కార్మికులు తమ సేవలను అందిస్తున్నారని, వారికి మెడికల్ టెస్టు కాని, మాలు, గెజిట్లు గాని, ఇతర ప్రభుత్వం ప్రకటించిన బీమా సదుపాయం వంటి సౌకర్యాలను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.ఆంజనేయులు, కరణం సూరిబాబు, డేగల నాగు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, శిరీష్ కుమార్, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.


స్టాప్ నర్సుల నుండి దరఖాస్తులు ఆహ్వనం


 


కోవిడ్ ఆసుపత్రులలో పనిచేయుటకు  స్టాప్ నర్సుల నుండి దరఖాస్తులు ఆహ్వనం


  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యస్.వి.రమణకుమారి


       విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్ 


కేంద్ర ప్రభుత్వము కోవిడ్ 19 ను జాతీయ విపత్తుగా గుర్తించిందని, తగు నివారణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడమైందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యస్.వి.రమణకుమారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి వారి కోవిడ్ ఆసుపత్రులలో అత్యవసర చికిత్సా విభాగంలో రెండు సంవత్సరములు  పనిచేయుటకు అనుభవజ్నులైన స్టాప్ నర్సుల నుండి దరఖాస్తులు ఆహ్వనించుచున్నామన్నారు.  బిఎస్సి నర్సింగ్/జిఎన్ఎం అర్హత ఉండాలని, తమ ధరఖాస్తులతో పూర్తి దృవీకరణ పత్రాలు జతపర్చి జిల్లా కేంద్ర మహారాజ ఆసుపత్రికి ఈనెల 23వ తేదీలోపు కార్యాలయపు పనివేళలలో సామాజిక దూరము పాటిస్తూ సమర్పించాలన్నారు.  పూర్తి వివరాల కొరకు  www.vizianagaram.nic.in  వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపారు. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...