Followers

ఎమ్మెల్యే అమర్నాథ్ చొరవ --  వ్యాపారాలకు అనుమతి








ఎమ్మెల్యే అమర్నాథ్ చొరవ

--  వ్యాపారాలకు అనుమతి

-- ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే జరిమానా

 

అనకాపల్లి , పెన్ పవర్

 

అనకాపల్లి పట్టణ  పరిధిలో ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలును నిర్వహించుకోవచ్చని జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ సడలింపు లో  భాగంగా కొన్ని వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అమర్నాథ్ చొరవ చూపడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రధాన రహదారుల్లో కూడా వ్యాపారాలు నిర్వహించుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపార యాజమాన్యం తప్పక ప్రభుత్వ నిబంధనలు పాటించాలని భౌతిక దూరం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు వార్డ్ ఇన్చార్జులు పలకా రవి, జాజుల రమేష్, కొణతాల భాస్కర్ , పీలా రాంబాబు తదితరులు పాల్గొని వ్యాపారులకు సూచనలు చేశారు. కంటెంట్మెంట్ జోన్ , బఫర్ జోన్ లలో లాక్ డౌన్ నిబంధనలు సడలింపు లతో కొనసాగుతున్నాయన్నారు. అనకాపల్లిలో ఎలాంటి కరోనా కేసులు లేకపోవడంతో ప్రధాన రహదారిలో కూడా వ్యాపారాలు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. వస్త్ర వ్యాపారాలు, బడా షాపింగ్ కాంప్లెక్స్ నువ్వు అనుమతి లేదన్నారు. సెలూన్ దుకాణాలకు వెళ్తే  ప్రజలు తప్పకుండా ఎవరు బ్లేడ్ వారే తీసుకువెళ్లాలని సూచించారు. దుకాణాలను సాయంత్రం 5 గంటలకల్లా మూసేయాలన్నారు. ప్రభుత్వం నిత్యావసర సరుకులకు సంబంధించే ప్రస్తుతానికి ఇచ్చినట్లు తెలిపారు. కొనుగోలుదారులు తప్పక భౌతిక దూరం పాటించేలా యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలన్నారు. దుకాణాల్లో సిబ్బంది తదితరులు వ్యక్తిగత శుభ్రత పాటించడం తో పాటు మాస్కులు వంటివి ధరించాలనారు. శానిటేజేషన్ వంటివి తప్పక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంలో వ్యాపార ప్రతినిధులు మాట్లాడుతూ తమకిచ్చిన సమయ వేళల్లో మార్పులు చేయాలని విన్నవించారు. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోవడంతో వ్యాపారాలకు అనుమతిచ్చిన తమకు లాభం లేదని వాపోయారు. 
 

 



 




 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...