Followers

నేటి నుండీ కొత్తగూడ లో స్వచ్ఛంద లాక్​డౌన్

 నేటి నుండీ కొత్తగూడ లో స్వచ్ఛంద లాక్​డౌన్

పెద్దగూడూరు, పెన్ పవర్ 

మహబూబబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నేటి (ఆదివారం) నుంచి పరిమిత స్వచ్ఛంద లాక్​డౌన్ ను విధిస్తున్నట్లు గ్రామపంచాయతీ పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ రణధీర్  తెలిపాడు. స్థానికుల సౌకర్యార్థం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు తెరిచి ఉంటాయని సూచించారు. మండల కేంద్రంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రం రూపం దాల్చుతున్న దృష్ట్యా... నేటి నుంచి  పరిమిత స్వచ్ఛంద లాక్​డౌన్​ విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛంద లాక్​డౌన్​కు ముందుకొచ్చినట్లు, అందరు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనీ, లేనిచో రూ.5000/- జరిమాన విధించబడుతుందని సర్పంచ్ తెలిపాడు. కొత్తగూడ మండల కేంద్రానికీ పరిసర ప్రాంతాల్లో నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారని... ఇటువంటి సమయంలో కరోనా కేసులు ఎక్కువయ్యే అవకాశముందని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా తమ వంతు చర్యగా పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని... మాస్కులు ధరించి... తమ కుటుంబాలని కాపాడుకోవాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరి జాగ్రత్తలో వారు ఉంటూ కేసులు పెరగకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని వ్యాపారస్థులు విజ్ఞప్తి చేశారు. స్థానికుల సౌకర్యార్థం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు తెరిచి ఉంటాయని సూచించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...