Followers

కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై రివ్యూ మీటింగ్

 కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై రివ్యూ మీటింగ్

మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

మంథని, పెన్ పవర్

మంథని నియోజకవర్గంలోని 4 మండలాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ పైన ఆస్పత్రిలో సౌకర్యాల పైన పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి మరియు మండల వైద్యాధికారు లతో మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రివ్యూ  నిర్వహించిన  మాజీ మంత్రి ప్రస్తుత మంథని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం లోని మంథని మండలము రామగిరి మండలం ముత్తారం మండలం కమాన్ పూర్ మండలంలో అక్కడి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని వాటి వివరాలు తెలుసుకొని వచ్చే వారం రోజుల్లో అన్ని మండలాల్లో 100% 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని డాక్టర్లను కోరారు. వ్యాక్సిన్ ఇప్పటి వరకు 45 సంవత్సరాలు నిండిన వారిలో మంథని మండలంలో 80% మందికి మరియు రామగిరి మండలంలో 50% మందికి కమాన్ పూర్ మండలంలో 50% మందికి ముత్తారం మండలంలో 40% శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ జరిగిందని వచ్చే 6 రోజుల్లో పూర్తి చేస్తామని డాక్టర్లు ఎమ్మెల్యే కి తెలిపారు. ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం జరిగితే చాలా వరకు వ్యాక్సిన్ అవసరముంటుందని చాలా కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ వ్యాక్సిన్ అందరికీ వేసే విధంగా కృషి చేయాలని డాక్టర్లను కోరారు. మంథని నియోజకవర్గంలోని మంథని మండలంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని మరియు జె.ఎన్.టి.యు కళాశాలలో కూడా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ కేంద్రంలో ఆక్సిజన్ సప్లయి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ నీ కూడా కోరుతానని తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ మరియు కరోనా టెస్ట్ లు ఒకే ప్రదేశంలో జరపకుండా ఒకే ప్రదేశంలో జరిపితే కరోనా ప్రబలే అవకాశం ఉందా  భౌతిక దూరం పాటిస్తూ వేరువేరుగా జరపాలని  అవసరమైతే వ్యాక్సిన్ కేంద్రాలను పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డాక్టర్లను కోరారు. ఎమ్మెల్యే జిల్లా వైద్యాధికారి కి అన్ని మండలంలోని ఆసుపత్రికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారికి కావలసిన టెస్ట్ కిట్లు వ్యాక్సిన్లు, మందులు, మాస్కులు, గ్లౌజులు తదితర అన్ని ప్రభుత్వం నుండి అందుబాటులో ఉండే  విధంగా అందించాలని కోరారు. మంథని మాతా శిశు ఆసుపత్రిలోని ఖాలిలను భర్తీ చేయాలని ఇక్కడ పనిచేసే వారికి ఇచ్చిన డిప్యూటేషన్ లను రద్దుచేసి వారిని ఆస్పత్రిలో సేవలు అందించే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, మరియు మంథని మండల వైద్యాధికారి శంకర దేవి, వైద్యులు అగంతం నరేష్, కమాన్ పూర్ వైద్యులు అశోక్ కుమార్, ముత్తారం వైద్యులు వంశీ కృష్ణ, రామగిరి వైద్యులు నాగ శిరోమణి మరియు ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...