Followers

నిజాంపేట్ కార్పొరేషన్ లో త్రాగునీటి సమస్యలు తీర్చండి

 నిజాంపేట్ కార్పొరేషన్ లో త్రాగునీటి సమస్యలు తీర్చండి.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్రాగు నీటి వసతి కోసం కోటి లీటర్ల సామర్థ్యం గల నాలుగు వాటర్ ట్యాంకర్లు ప్రారంభోత్సవానికి నోచుకోక ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం బిజెపి నాయకులు ప్రారంభం లోనే ట్యాంకర్లను సందర్శించి త్రాగు నీటి సమస్యలు పరిష్కరించాలని పర్యటన.. కార్పొరేషన్లో తాగునీరు రోజువారీగా అధికారికంగా అనుమతి ప్రకారం 1.5 కోట్ల లీటర్లు వస్తుంది. కానీ మూడు కోట్ల లీటర్ల త్రాగునీరు నీరు సాధిస్తేనే కానీ కార్పొరేషన్ త్రాగునీటి సమస్య పరిష్కారం కాదు. ఇప్పటి కూడా 6 బలహీనవర్గాల కాలనీలకు పూర్తిస్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించలేని  పరిస్థితి . పైగా ఈ సంవత్సరన్నర కాలంలోనే దాదాపు 1500 అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగింది . కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించి మరో   కోటి లీటర్ల సామర్థ్యం గల మూడు మంచినీటి ట్యాంకులను నిర్మించి, సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభించక పోవడానికి కారణం ఏమిటో మున్సిపల్ , వాటర్ వర్క్స్ అధికారులు సమాధానం చెప్పాలని,నిజాంపేట్ కు 2 కోట్ల లీటర్ల త్రాగునీరు అధికారికంగా  ఉత్తర్వులు లేకపోవడమేనని, తక్షణమే మున్సిపల్,  వాటర్ వర్క్స్ అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని, నూతనంగా నిర్మించిన కోటి లీటర్ల సామర్థ్యం గల వివిధ మంచినీటి ట్యాంకులను తక్షణమే ప్రారంభించాలని ,6ఎంజిడి లీటర్ల త్రాగునీరు అధికారికంగా మంజూరు చేయించి, త్రాగునీరు ప్రజలందరికీ సప్లై చేయాలనీ, శనివారం.. ప్రారంభం నోచుకోని వాటర్ ట్యాంక్ ను సందర్శించడమే గాక, ఈ సమస్యపై కలెక్టర్ మరియు వాటర్ వర్క్స్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడమేగాక సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ముదిరాజ్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర చౌదరి, వైస్ ప్రెసిడెంట్ శివ కోటేశ్వరరావు, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...