హెల్ప్ లైన్ సెంటర్ ను సందర్శించిన ఆదిలాబాద్ డి ఎం హెచ్ ఓ...
ఆదిలాబాద్ , పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరెందర్ రాథోడ్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్ని మతాల పెద్దల ఆధ్వర్యంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు లో మాట్లాడారు ఈ సంధర్భంగా డి.యం.హెచ్.ఓ. మాట్లాడుతూ మొదట సాజిద్ ఖాన్ గారికి కృతజ్ఞతలని తను చెప్పిన వెంటనే అన్ని మతాల పెద్దలతో ఇంత చక్కటి అవగాహన కార్యక్రమం చేపట్టాడం అభినందనీయమన్నారు.మన ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా వ్యాధి తీవ్రస్థాయిలో ఉందని.ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటించక పోవడం,నిర్లక్ష్యపు ధోరణి ఈ కరోనా మహమ్మారి తీవ్రతరం కావడానికి ముఖ్యకారణాలు అని అన్నారు.మాస్కులు అన్ని సమయాల్లో ధరించాలని, సామాజిక దూరం పాటించి,ఏ వస్తువు ముట్టినా సబ్బుతో చేతులు కడుక్కోవాలని ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. ఈ మూడు నియమాలు పాటించాలని కోరారు. 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరూ ఎలాంటి సందేహాలు లేకుండా భయపడకుండా వాక్సిన్ తీసుకోవాలని,ఒకవేలా మళ్ళీ పాజిటివ్ వచ్చినా చిన్న చిన్న లక్షణాలతో,మరణం లేకుండా బయట పడవచ్చని తెలిపారు.అనంతరం వివిధ మతాల మత పెద్దలు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆయా మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment