Followers

బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

 బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం


తొర్రూరు, పెన్ పవర్

టివిఎస్ ఎక్సెల్ బైక్ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సిహెచ్ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన మేడిగా లక్ష్మయ్య (57) బట్టల వ్యాపారం చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నారు. తొర్రూరు మండల కేంద్రానికి పని మీద వచ్చి పని ముగించుకొని, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తన ఎక్సెల్ బండి పై ఇంటికి వెళుతున్న దారిలో బొత్తల తండా శివారులోని కల్వర్ట్ దగ్గర కాలువలో ఉన్న బండా రాయిపై పడి, తలకు బలమైన గాయం కావడంతో, మరణించడం జరిగిందని,మృతుని భార్య మేడిగా మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.శవ పంచనామ కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మయ్య మృతితో అమ్మాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...