కేసముద్రం వ్యవసాయ మార్కెట్ 9 రోజులు బంద్,,
మార్కెట్ చైర్మన్ మరి నారాయణ రావు...
కేసముద్రం, పెన్ పవర్కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో పనిచేసే గుమస్తాలు, హమాలీలు, దడువాయిలు, వీరితో పాటు వ్యాపారస్తుల కోరికమేరకు కోవిడ్-19 వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున వాక్సిన్ వేయించుకొనుటకుతేది.01.05.2021నుండితేది.09.05.2021 వరకు మార్కెట్ బంద్ చేయాలని కోరినట్లు మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు తెలిపారు. అంతేగాక మిల్లుల వద్ద కొనుగోలు చేయమని, అట్టి పనులలో కార్మికులు పాల్గొనమని చెప్పడంతో రైతులు తమ సరుకులను మార్కెట్ గాని, వ్యాపారస్తులమిల్లుల వద్దకు గాని తీసుకురావద్దని తెలియజేశారు. ఈ పది రోజుల సెలవులలో మే 1న మే డే సెలవు గా, మే 2న ఆదివారం కాగా, మే 3నుండి మే 7 వరకు కూలీలు హమాలీల వ్యాపారస్తుల కోరికమేరకు కరోన బంద్ గా అలాగే మే 8 వారాంతపు సెలవు గా మే 9న ఆదివారం కాగా రైతుల ఇట్టి విషయాన్ని గమనించి రైతులు ఎవరు కూడా సరుకులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని తిరిగి తేదీ 09.05.2021 (సోమవారం) రోజున మార్కెట్ యార్డ్ కు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకు రాగలరని తెలియజేయడం జరిగింది.
No comments:
Post a Comment