Followers

Showing posts with label HEALTH AND EDUCATION. Show all posts
Showing posts with label HEALTH AND EDUCATION. Show all posts

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అభినందనీయం

 ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అభినందనీయం

-జిల్లా కలెక్టర్ విపి గౌతమ్

తొర్రూరు,  పెన్ పవర్

కరోనా విపత్కర వేళ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అందించడం అభినందనీయమని,జిల్లా కలెక్టర్ విపి గౌతమ్  పేర్కొన్నారు. కరోనా విస్తృతి వేళ పరీక్షలకు వినియోగించే సర్జికల్ టేబుళ్లను ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ధరావత్ విమల ప్రభుత్వ ఆసుపత్రికి విరాళంగా అందించారు. విమల కోడలు డాక్టర్ మౌనిక జన్మదినాన్ని పురస్కరించుకొని, శుక్రవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు పరికరాలను జిల్లా కలెక్టర్ పివి గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గుండాల మురళీధర్ కు అందజేశారు. విమల సేవా నిరతిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. లాక్ డౌన్ సమయంలోనూ విమల పేదలకు నిత్యావసర సరుకులు  అందించి, దాతృత్వం చాటుకుందని, కలెక్టర్ గుర్తుచేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల సంఖ్య పెంచేందుకు, వ్యాక్సినేషన్ కు అందరినీ సమాయత్తం చేసేందుకు వైద్య,ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని, కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి ఓపీ నిమిత్తం వచ్చేవారికి భోజనం అందించేందుకు సైతం చొరవ చూపాలని, కలెక్టర్ విమలకు సూచించారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు విమల అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో  డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీ రామ్, తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో భారతి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, ధర్మ శ్రీ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ప్రమీల,అధ్యక్షుడు ధరావత్ విశ్వనాధ్, హోమేష్, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మాస్క్ లు ధరిస్తూ కరోనా రక్కసిని అడ్డుకుందాం

మాస్క్ లు  ధరిస్తూ కరోనా రక్కసిని అడ్డుకుందాం 


పెన్ పవర్, రెబ్బెన 

కొమరంభీమ్ జిల్లా రెబ్బెన మండలము లోని రాజారాం గ్రామ పంచాయతి లో ప్రజలు అందరూ అప్రమత్తం గా ఉండాలి. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరిస్తూ భేతిక దూరం పాటించాలి. ఈ మహమ్మారి అడ్డుకుందం అందరూ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అవసరానికి మించి బయటకు రావద్దని ప్రజలు అందరూ హోమ్ లోనే ఉండాలి. మన గ్రామ పంచాయతి లోని వాడ  వాడలా కు హైపో  క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కరోనా -19 వ్యాక్సిన్ తీసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజారాం సర్పంచ్ ఒరగంటి మల్లేష్  సందీప్ అజయ్ రాజేందర్ నరేష్  పాల్గొన్నారు. 

4వ వార్డులో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయించిన కౌన్సిలర్.

 4వ వార్డులో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయించిన కౌన్సిలర్...

పెన్ పవర్, మేడ్చల్

రోజు రోజుకు కరోన సెకండ్ వేవ్ విజృబింస్తున వేళా ప్రజల ఆరోగ్యని దృష్టిలో ఉంచుకుని కార్మిక శాఖ మంత్రి మాల్లారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, సహకారంతో కౌన్సిలర్ తుడుం గణేష్  ఆధ్వర్యంలో 4 వ వార్డులో హైడ్రో క్లోరిన్ ఆమ్లని, పిచికారి చేయించారు. ఈ సందర్భంగా 4 వ వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోన వైరస్ సెకండ్ వేవ్ ప్రబలుతున్న వేళా అనేక మంది ప్రాణాలు తీస్తున్న  మనం కరోన వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసరమైతే తప్పా ఇంట్లో నుండి బయటకు రాకూడదు అలాగే ఎల్లప్పుడూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ వాడాలని ముఖ్యంగా చిన్నపిల్లలు వయసు పైబడిన వాళ్ళు వైరస్ అధికంగా సోకే లక్షణాలు ఉన్నందున వారు బయటకు రాకుండా చూడాలని అలాగే షాపు యజమానులు శానిటైజర్ వాడుతు వినియోగదారులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించినవారికి మాత్రమే సరుకులు ఇవ్వాలని లేదా షాపు యజమానులకు జరిమానా విధించబడుతుంది అని కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు.

17 రోజులు హోమ్ క్వారంటైన్ పూర్తి కాకుండా బయట తిరిగితే కఠిన చర్యలు

 17 రోజులు హోమ్ క్వారంటైన్ పూర్తి కాకుండా బయట తిరిగితే కఠిన చర్యలు..

మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్..

ఎల్లారెడ్డిపేట , పెన్ పవర్

ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండలాల ప్రజలు కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ హోం క్వారంటైన్ 17 రోజులు పూర్తి కాకుండానే బయట స్వేచ్ఛగా తిరుగుచున్నారు. ఇది చాలా ప్రమాద ప్రమాదకరమని హోం క్వారంటిన్ పూర్తి కాకుండా బయట తిరిగినట్లయితే వారి ద్వారా ఇతరులకు కరోనా వ్యాప్తి చెందుతుందని. కావున ప్రతి ఒక్కరూ కూడా హోం క్వారంటైన్ నిభందనలు పాటించి మిమ్మల్ని మీరు రక్షించు కుంటు , మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కరోనా బారిన పడకుండా రక్షించిన వారవుతారని మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ గారు తెలిపారు.

జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

 జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

 -ఖలిన్దర్ అలీ ఖాన్.  సిపిఐ పట్టణ కార్యదర్శి. 

మంచిర్యాల ,  పెన్ పవర్

 మంచిర్యాల జిల్లాలో కరోనా  వైరస్ తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి  జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు.  ప్రపంచ దేశాలు సురక్షితంగా ఉంటే భారత్ బయోటెక్ అనే సంస్థ వ్యాక్సిన్ కనుగొన్న ఈ దేశంలో వ్యాక్సిన్ అందక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి అని అన్నారు. వైరస్ సోకిన వారి దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యాలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయి అని తెలిపారు.  ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేట్ హాస్పిటల్ లో దోపిడి నివారించడంలో పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమని పేదలందరికీ వైరస్ సోకిన వారికి ఉచిత వైద్యం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం వైరస్ నిర్మూలనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా నివారణకు దృష్టి సారించాలని జిల్లా అధికారుల కోరుతున్నాం అని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి  వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వడంలో విఫలమైందని, ప్రపంచ దేశాలులో  కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉండడం దీనికి నిదర్శనమని అన్నారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా ఏ.ఐ. టి. యు. సి. కార్యదర్శి మేకల దాసు, జిల్లా సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి పౌల్, చాడ మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పెన్ పవర్ కథనానికి స్పందన

 పెన్ పవర్ కథనానికి స్పందన  

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టికా కోసం మరియు కరోనా టెస్టుల కోసం వచ్చే వారికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అనే కథనాన్ని రెండు రోజుల క్రతమే పెన్ పవర్ దినపత్రిక ప్రచురించింది. దీనికి స్పందనగా  స్థానిక ప్రజా ప్రతినిధులు ఆసుపత్రికి వచ్చే వారికి, నీడ కోసం  గ్రీన్ నెట్ లు ఏర్పాటు చేసారు. దీనికీ గాను స్థానిక ప్రజలు వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా ప్రచురించిన పెన్ పవర్ దినపత్రిక యాజమాన్యానికి, వెంటనే స్పందించిన  తాండూర్ గ్రామ పంచాయతీ ఇంఛార్జి సర్పంచ్ పూదరి నవీన్ కుమార్ కి, ఈవో తపస్ కి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

తాళ్ల గురిజాల పి హెచ్ సి ముందు గ్రీన్ సిటీ ఏర్పాటు

 తాళ్ల గురిజాల పి హెచ్ సి ముందు గ్రీన్ సిటీ ఏర్పాటు

బెల్లంపల్లి, పెన్ పవర్

మండలంలోని తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కరోనా టెస్టులకు. మరియు టీకాకొరకు రోజు ఎంతో మంది వస్తున్నారని,వారు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాళ్ల గురజాల సర్పంచ్ దృష్టి కి రావడంతో వెంటనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా సర్పంచ్ గాజుల రంజిత వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రీన్ సిట్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంల్ ఎంపిఓ  శ్రీనివాస,కార్యదర్శి లక్ష్మి,మల్టీ పర్పస్ వర్కర్స్ సిబ్బంది పాల్గొన్నారు

కరోనా పట్ల ప్రజలు ఆధైర్య పడవద్దు

 కరోనా పట్ల ప్రజలు ఆధైర్య పడవద్దు

కోవిడ్ బాధితులకు అండగా నిలవాలి.

ఖానాపురం గ్రామ సర్పంచ్ చెట్టుపల్లి ఉమారాణి సోమయ్య.

తొర్రూరు, పెన్ పవర్

కోవిడ్ బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం  ఎంతైనా ఉందని, మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఖానాపురం గ్రామ సర్పంచ్ చెట్టుపల్లి ఉమారాణి సోమయ్య అన్నారు.గురువారం గ్రామ సర్పంచ్ చెట్టుపల్లి ఉమారాణి సోమయ్య ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు మాంసం, పౌష్టికాహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... రోజు వారీగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్‌ను నియంత్రించే అవకాశముందని, చెప్పారు. ప్రతి రోజూ శరీరానికి అవసరమైన మోతాదులో పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చునని, తెలిపారు. పండ్లు, కూరగాయాలు, పాలు, మాంసకృతు ల వంటి వాటిని తీసుకుంటే మంచిందన్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేక అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారని, పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చీకటి శ్రీధర్ గౌడ్,  పంచాయతీ కార్యదర్శి నూరుద్దీన్,వార్డు సభ్యులు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలే పణంగా... ఆరోగ్య సిబ్బంది సేవలు

 ప్రాణాలే పణంగా... ఆరోగ్య సిబ్బంది సేవలు

కరోనా కట్టడికి ఆరోగ్య సిబ్బంది ఎనలేని సేవలు

వైద్య సిబ్బందికి ప్రజల అభినందనలు


చిన్నగూడూరు , పెన్  పవర్

చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత ఏడాది నుంచి నేటి వరకు కరోనా నివారణకు ఆరోగ్య  సిబ్బంది నిత్యం పనిచేస్తూనే ఉన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా బారిన పడిన వారికి మందుల పంపిణీ చేస్తూ సేవలందిస్తున్నారు. కరోనా బారినుండి బయటపడ్డామని ప్రజలు సంతోష పడుతున్న సమయంలోనే మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో కరోనా నివారణకు ఆరోగ్య సిబ్బంది విస్తృతంగా సేవలు అందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కరోనా బారిన పడకుండా ఉచిత వ్యాక్సిన్  పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో కనీసం తీరికలేకుండా పంపిణీ మందుల పంపిణీ , వ్యాక్సిన్ పంపిణీ వంటి సేవలు అందించాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందికి మరింత పెరిగింది. కరోనా వ్యాప్తి నివారణకు ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని మండలంలోని పలువురు కొనియాడుతున్నారు. బుధవారం రోజు 20  మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4  పాజిటివ్ వచ్చినట్లు వారికి మందుల పంపిణీ చేసి వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి  వివరించినట్టు మండల వైద్యాధికారి డాక్టర్ రవి తెలిపారు. ప్రజలు సహకరిస్తే ప్రజారోగ్యం... చిన్నగూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని నివారించడం కోసం ప్రజలు ఎవ్వరికీ వారు చైతన్యవంతులు అయి సహకరిస్తేనే కరోనాను అరికట్టవచ్చని మండల వైద్యాధికారి డాక్టర్ రవి అన్నారు. భోజన సమయం లేకుండా విధులు... కరోనా సెకండ్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడంతో ప్రజలు ఉదయాన్నే వ్యాక్సిన్ కోసం, పరీక్షలకోసం చిన్నగూడూరు మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము భోజన సమయాన్ని సైతం వినియోగించుకోకుండా ఆరోగ్య సిబ్బంది అటెండర్ నుండి డాక్టర్ వరకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బాధితులకు  జాగ్రత్తలు చెబుతూ ఆత్మ ధైర్యాన్ని నింపుతున్నామని వైద్యాధికారి గూగుల్ లోతు రవి అన్నారు.

జమ్మిగడ్డ పీహెచ్ సి లో వ్యాక్సినేషన్ వేయించుకున్న.. ఎంపీ రేవంత్ రెడ్డి

 జమ్మిగడ్డ పీహెచ్ సి లో వ్యాక్సినేషన్ వేయించుకున్న.. ఎంపీ రేవంత్ రెడ్డి

పెన్ పవర్ , కాప్రా

మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ పి హెచ్ సి లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. పిహెచ్ సి ఇన్ ఛార్జ్ డాక్టర్ సంపత్ ఎం పి రేవంత్ రెడ్డికి వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా పిహెచ్ సీ లో జరుగుతున్న కరోన టెస్ట్ లు, వ్యాక్సినేషన్ గురించి ఎంపీ రేవంత్ రెడ్డి డాక్టర్ సంపత్, డాక్టర్ స్వప్న రెడ్డిలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మల్లికార్జున్, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్,  ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బి. రాఘవ రెడ్డి నాయకులు నీరుకొండ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాలపై అవగాహన తప్పనిసరి

 అగ్నిప్రమాదాలపై అవగాహన తప్పనిసరి

అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ రావు

 రామ్ దేవ్ రావు ఆసుపత్రిలో మాక్ డ్రిల్ 

పెద్ద ఎత్తున హాజరైన వివిధ ఆసుపత్రుల సిబ్బంది





కూకట్ పల్లి, పెన్ పవర్

కరోన విజ్రంభిస్తు ఆస్పత్రులని రోగులతో నిండిపోతున వేళా అగ్నిప్రమాదాల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి అని కూకట్ పల్లి జోన్ అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ రావు అన్నారు.  అవగాహన తోనే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడొచ్చన్నారు. ఈ మేరకు అగ్ని ప్రమాదాల సమయంలో వాస్తవ పరిణామాలను ప్రతిబింబిస్తూ గురువారం రాందేవ్ రావు ఆసుపత్రిలో చేపట్టిన మాక్ డ్రిల్ విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. అగ్ని ప్రమాదాలు జరగడానికి గల ఆస్కారాలు, వాటి నివారణ చర్యలు, రోగులను పైఅంతస్తుల నుండి నేర్పుగా క్రిందికి దింపే ప్రక్రియలు, క్షతగాత్రులకు అందించాల్సి న తక్షణ వైద్యంపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ  ఆసుపత్రి సిబ్బంది అవగాహనతో ఉంటే మంటలు చెలరేగినప్పుడు తాము వచ్చేలోపే ప్రమాద తీవ్రతను తగ్గించగలరని పేర్కొన్నారు. రామ్ దేవ్ రావు ఆసుపత్రి ఎమ్.డి డాక్టర్ కె.కమలాకర్, సిఇఒ డాక్టర్ యోబు మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణపై తమ సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించినందుకు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు వాటిల్లకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాందేవ్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, వివిధ ఆసుపత్రుల సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.

అన్ని దానలకంటే రక్తదానం చాలా గొప్పది

 అన్ని దానలకంటే రక్తదానం చాలా గొప్పది

ఆదిత్య ఆసుపత్రి సహకారంతో విజయవంతంగా రక్తదాన శిబిరం

లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణంలో గురువారం ఆదిత్య ఆసుపత్రి సహకారంతో అమృత వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్విహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగిందని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్స రాల పైబడిన వాళ్ళు కరోన వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరవై రోజుల వరకు రక్తదానం చేయడానికి వీలుండదని,దీని కారణంగా బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిలువలు తగ్గి ఎవరికైనా తలసేమియా ఇతర వ్యాధి గ్రస్థులకు రక్తం అందని పరిస్థితి ఏర్పడుతుందని అలాంటి వల్ల ప్రాణాలను కాపాడడానికే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మనం చేసే రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడినవాళ్ళమవుతామని అంతే కాకుండా మనం చేసే రక్తదానంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడిన వాళ్ళవుతామన్నారు.సుమారుముప్పై మంది రక్తదాతలు రక్తదానం చేయగా వారందరిని అమృత బ్లాండ్ బ్యాంక్ ఆదిత్య ఆసుపత్రి మనస్ఫూర్తిగా అభినందించారు.రక్తదానం చేసిన వాళ్లందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వహికులు సతీష్ కుమార్, డాక్టర్ ప్రియాంక, అమృత వాలంటరీలు అనూష తదితరులు పాల్గొన్నారు.

మాస్కులు శానిటైజర్లు పంపిణీ

మాస్కులు శానిటైజర్లు పంపిణీ 

మేడ్చల్, పెన్ పవర్ 

కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎంఆర్ గ్రూప్స్ కార్యదర్శి గోపాల్ రెడ్డి అన్నారు.గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఎంఆర్ సెట్ కళాశాల ఆద్వర్యంలో గురువారం మేడ్చల్ మున్సిపాలిటీలోని పలు బస్తీల్లో ప్రజలకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి పంపిణీ చేసి కరోనా కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఎంఆర్ గ్రూప్స్ కార్యదర్శి గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ నారాయణ,కో ఆర్డినేటర్లు నాగరాజు దివ్య, మున్సిపల్ వైస్ చైర్మెన్ రమేష్, వెంకటేశ్వర్లు, నాయకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్

 ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్

సీసియర్ సిటిజన్లు, గర్భిణీలకు అత్యవసర పరిస్థితుల్లో సేవలు

హెల్ప్‌లైన్ నంబర్ 9490617234తో సేవలను వినుయోగం 




పెన్ పవర్, మల్కాజిగిరి 

నాన్ కొవిడ్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల నిమిత్తం ఉచిత అంబులెన్స్ స‌ర్వీసుల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ బుధ‌వారం ప్రారంభించారు. టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్ స్మార్ట్ఐఎంఎస్‌ ఉచిత అంబులెన్స్సేవలను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ వైద్య పరీక్షలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు రోజులో ఎప్పుడైనా ఈ సేవలను ఉచితంగా పొంద‌వ‌చ్చ‌న్నారు.  ఆక్సిజన్, వెంటిలేషన్, ఇతర అత్యవసర సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లను అందిస్తున్నాయి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, వికలాంగులు ఈ సేవలను ఆసుపత్రులు, రోగనిర్ధారణ కేంద్రాలు, బ్ల‌డ్ బ్యాంకుల‌ను సందర్శించేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. రాచకొండ కమిషనరేట్ ప‌రిధిలో వచ్చే రెండు నెలలు ఈ అంబులెన్సులు క్రీయాశీల‌కంగా అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు చెప్పారు. కొవిడ్ -19 నుండి ప్ర‌జ‌లు తమను తాము రక్షించుకోవడా నికి మాస్కు ధరించడం,శానిటైజర్‌ను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల ని కోరుతున్న‌ట్లు వెల్ల‌డించారు. నాన్ కొవిడ్ -19 వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు రాచకొండ కొవిడ్ కంట్రోల్ హెల్ప్‌లైన్ నంబర్ 9490617234 ను సంప్రదించవచ్చు అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలను పొందటానికి స్టాన్‌ప్లస్ హాట్‌లైన్ నంబర్ 1800 – 121911911 ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

అంగడి నిర్వాహణపై సర్పంచ్ రమేష్ నాయక్ నజర్

  అంగడి నిర్వాహణపై సర్పంచ్ రమేష్ నాయక్ నజర్

పెద్దగూడూరు, పెన్ పవర్  

మహబూబబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోనీ సంతను సర్పంచ్ నూనావత్ రమేష్ నాయక్ తనిఖీ చేశారు. వ్యాపారస్థులు విధిగా మాస్కులు ధరించాలనీ సూచించారు. శానిటైజర్ తో చేతులను పరిశుభ్ర పరుచుకోవాలనీ, కోవిడ్ వ్యాప్తి జరుగుకుండా జాగ్రత్తలను వారికీ సర్పంచ్ తెలిపాడు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫెనాల్టీ విధిస్తానని హెచ్చరించాడు. ప్రజలు గుంపులు ఉండకుండా, వ్వవహరించాలనీ సిబ్బందికీ తగు జాగ్రత్తలు సర్పంచ్ రమేష్ నాయక్  సూచించాడు.

వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన నిబంధనలు గాలికి

 వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన నిబంధనలు గాలికి

వనపర్తి,  పెన్ పవర్

వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సామాజిక దూరం లేకుండా వరుసగా నిలబడ్డారు.కరోన టెస్టింగ్ కోసం వచ్చిన వారిని సామాజిక దూరం పాటించాలని చెప్పే వారు లేరు.వనపర్తి  పట్టణంలో గత కొద్దిరోజులుగా కరోన పెరుగుతోంది.సామాజిక దూరం పాటించకుంటే కరోన లేని వారికి కరోన ఉన్న వారి ద్వారా కరోన వచ్చే అవకాశం ఉంది.వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో,గాంధీనగర్, టీచర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ల దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పేదలు వైద్యానికి ఇబ్బంది పడకుండా కృషి

 పేదలు వైద్యానికి ఇబ్బంది పడకుండా కృషి:  ఉపసభాపతి పద్మారావు గౌడ్ 

తార్నాక ,  పెన్ పవర్

సితాఫలమండీ లోని తన సికింద్రాబాద్ నియోజకవర్గ  క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధిద్వారా తాను మంజూరు చేయించిన  72  మందికి రూ.50 లక్షల విలువజేసే చెక్కలను ఉప సభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా పేదలను ఆదుకొనేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని  తాము ఆదుకుంటామని  పద్మారావు  గౌడ్ తెలిపారు.    బస్తీ దవఖనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వర ప్రసాదంగా నిలుస్తోందని తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాతే సీఎం సహాయ నిధి  ప్రాచుర్యం పేదలకు చేరుతోందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. తమ పరిధిలో కరోనా వ్యాధి కట్టడికి ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు.  అత్యవసర సందర్భాల్లో తమ కార్యాలయం టెలిఫోన్  నెంబరు 040-27504448లో సంప్రదించాలని  తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు,     తెరాస యువ నాయకుడు తీగుల్ల రామేశ్వర్ గౌడ్,  తెరాస నేతలు పాల్గొన్నారు.

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్

 బెల్లంపల్లి  ఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయం  పరిసరం లో  వ్యాక్సిన్  రిజిస్ట్రేషన్  హెల్ప్ డెస్క్  ఏర్పాటు  చెయ్యాలి 

బెల్లంపల్లి,  పెన్ పవర్

బెల్లంపల్లి  నియోజకవర్గం  లో దాదాపు లక్ష 50 వేలమంది లో ఎక్కువ శాతం 18 సంవత్స్రాలు పై బడిన వ్యక్తులు కలరు  వృద్ధులకు మరియు 45   సం వత్స్రాలు పై బడిన వ్యక్తులు లో కొందరు వ్యాక్సిన్ వేసుకున్నకూడా అత్యధిక జనాభా 18 -44 మధ్య వయస్సు వ్యక్తులు కలరు . కనీస సౌకర్యాలు కల్పించకుండా అవగాహన కల్పించకుండా  సింగరేణి హాస్పిటల్ లో  వైద్యులను   వ్యాక్సిన్ కి సిద్ధం గా ఉండమనటం ఎం ఎల్ ఏ  కు హేతు బద్దం గా లేదు. దాదాపు లక్ష పై చిలుకు వ్యక్తులకు దాదాపు 7 నుంచి 8 ప్రాథమిక మరియు కమ్యూనిటీ హాస్పిటల్ లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారో ప్రజలకు చెప్పాలి .  లక్ష మందికి 8 నుంచి 10 వైద్య  కేంద్రాలలో వ్యాక్సిన్ కొరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చెయ్యాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు   కోవిడ్  వ్యాక్సిన్ కొరకు  ఆన్లైన్ అప్ ద్వారా   రిజిస్టర్   చేసుకోవాలి  తదనుగుణం  గా   సంబంధిత హాస్పిటల్  లో  వ్యాక్సిన్  సెంటర్ కి  వెళ్ళాలి  అని సూచిస్తున్నాయి కానీ ఏ  హాస్పిటల్  లో   రిజిస్టర్    అయిన వ్యక్తుల  వివరాలు   సరిచూడు     సిబ్బంది  లేరు   కనీస వసతులు లేవు  ప్రాధమిక   వైద్య  కేంద్రాలకు   వచ్చు  నిధులు   వైద్యులు పేపర్ ల మీద  చూపెట్టి  స్వాహా   చేస్తున్నారు  కానీ   వ్యాక్సిన్  సమయం లో  కనీస   అవసరాలకు  ఖర్చు చెయ్యటం  లేదు   వ్యాక్సిన్  కోసం  వచ్చు వారికీ   నీటి సౌకర్యం   వేచి ఉండు టకు  ఎలాంటి సౌకర్యాలు  కల్పించలేదు  వికలాంగులకు   మానసిక  వికలాంగులకు   వృద్దులకు  సహాయం   చేయుటకు   ఎవరు లేరు వీల్  చైర్ సౌకర్యం లేదు చదువు రాణి వారికి సహాయం చేయు వ్యక్తులు,సిబ్బంది లేరు  నియోజక వర్గ  నిధులు  5 కోట్లు  కేటాయించినా   ఎప్పుడు  వారు  వైద్య  అవసరాలకు  కేటాయించలేదు.  కనీసం  ఇప్పుడు   అయినా   ప్రాధమిక  వైద్య   కేంద్రాల లో  కమ్యూనిటీ  హాస్పిటల్ లో   కనీస  అవ్సరాలు   ఏర్పాటు  చెయ్యటానికి   కేటాయించాలి   సింగరేణి  కోవిడ్  హాస్పిటల్  లో   ఆక్సిజన్   సిలిండర్  ల  కొరత లేకుండా చూడాలి. నియోజకవర్గము లో ప్రతి మండల ము లో  ప్రభుత్వ   అంబులెన్స్   అందుబాటులో  ఉంచాలి    ఒక  వేళ ప్రభుత్వ   అంబులెన్స్  లేనట్లు   అయిథెయ్ 3 నెలలకు    అద్దె ప్రాతిపదిక లో   అయినా   అంబులెన్స్   లు       ప్రయివేట్ వ్యక్తుల వద్ద నుంచి  సుమండిత  మున్సిపల్ మండల  ఆఫీస్ లు తీసుకోవాలి  వాటికి  ఆవు ఖర్చు మున్సిపల్  మండల ఆఫీస్ లు భరించాలి . బెల్లంపల్లి అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది లేనియెడల ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాం అని అన్నారు  ఈ కార్యక్రమంలో. గెల్లీ జయరాం యాదవ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండ చంద్ర మాణిక్యం సి.పి.ఐ పట్టణ కార్యదర్శి అమానుల్లాఖాన్ టి.డి.పి జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల మధు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గో గర్ల శంకర్ రెడ్ స్టార్ పార్టీ  సి.పి.ఐ ఎం.ఎల్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీ సతీష్ కుమార్ ఇండియా ప్రజాబంధు పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ గౌస్ హెచ్.ఎం. ఎస్ నాయకులు ఆడెపు మహేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం...


ఆదిలాబాద్ ,  పెన్ పవర్

ఆదిలాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి   నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ప్రతిక్షణం కోవిడ్ రోగుల పరిరక్షణ కోసం  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు.స్థానిక శాంతినగర్ లో బుధవారం కొవిడ్ కంట్రోల్ రూమ్ ను పార్టీ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్ పదిమంది సభ్యులు ఉంటారని, వారు మూడు షిఫ్ట్ లు వారీగా పని చేస్తారన్నారు. ప్లాస్మా, ఆక్సిజన్, హాస్పిటల్లో బెడ్లు, వెంటిలేటర్లు, మెడిసిన్ లాంటి సంబంధించిన సేవలు అందుబాటు లో ఉంటాయని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా ఈ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్, చరణ్ గౌడ్, చంద్రాల రాహుల్, రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి

 కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి...

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ డిమాండ్.

ఉట్నూర్, పెన్ పవర్

కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మండిపడ్డారు. బుధవారం  ఉట్నూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపు లేక,ప్రస్తుతం  ప్రజా వ్యవస్థ అతలాకుతలం అయ్యిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా వ్యాధిని వెంటనే ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజల్లో వారి జీవన విధానం, కోవిడ్ వ్యాధిపై అయోమయం లో ఉంటే, ప్రజా ప్రతినిధులు పలకరించిన పాపాన పోలేరని మండి పడ్డారు. భయం తో ప్రజలు ఉన్న ఆస్థులమ్ముకొని, ప్రయివేటు దవాఖానకు ధారపోసి, వీధిన పడే పరిస్థితి దాపురించిందన్నారు. కనీసం గ్రామాల్లో కరోనా టెస్ట్ లు చేయలేని పరిస్థితి ఉందన్నారు. దీంతో టెస్టుల్లో జాప్యం జరిగి, వ్యాధి తీవ్రత ఎక్కువై ప్రజలు చనిపోయిన సంఘటనలు చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి,ఆదుకోవాలని కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...