Followers

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అభినందనీయం

 ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అభినందనీయం

-జిల్లా కలెక్టర్ విపి గౌతమ్

తొర్రూరు,  పెన్ పవర్

కరోనా విపత్కర వేళ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అందించడం అభినందనీయమని,జిల్లా కలెక్టర్ విపి గౌతమ్  పేర్కొన్నారు. కరోనా విస్తృతి వేళ పరీక్షలకు వినియోగించే సర్జికల్ టేబుళ్లను ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ధరావత్ విమల ప్రభుత్వ ఆసుపత్రికి విరాళంగా అందించారు. విమల కోడలు డాక్టర్ మౌనిక జన్మదినాన్ని పురస్కరించుకొని, శుక్రవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు పరికరాలను జిల్లా కలెక్టర్ పివి గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గుండాల మురళీధర్ కు అందజేశారు. విమల సేవా నిరతిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. లాక్ డౌన్ సమయంలోనూ విమల పేదలకు నిత్యావసర సరుకులు  అందించి, దాతృత్వం చాటుకుందని, కలెక్టర్ గుర్తుచేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల సంఖ్య పెంచేందుకు, వ్యాక్సినేషన్ కు అందరినీ సమాయత్తం చేసేందుకు వైద్య,ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని, కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి ఓపీ నిమిత్తం వచ్చేవారికి భోజనం అందించేందుకు సైతం చొరవ చూపాలని, కలెక్టర్ విమలకు సూచించారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు విమల అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో  డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీ రామ్, తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో భారతి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, ధర్మ శ్రీ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ప్రమీల,అధ్యక్షుడు ధరావత్ విశ్వనాధ్, హోమేష్, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...