Followers

కరోన నిభందనలపై నిర్లక్ష్యం వ్యహిస్తే కఠిన చర్యలు

 కరోన నిభందనలపై నిర్లక్ష్యం వ్యహిస్తే కఠిన చర్యలు - సిఐ నర్సింహ్మ స్వామి

మాస్కు, బౌతిక దూరం తప్పనిసరి

కర్ప్యూ  నిబంధనలు మరింత కఠినం బయటకు వస్తే కేసులు


పెన్ పవర్, మల్కాజిగిరి 

కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ, మాస్కులు, బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి అన్నారు. కరోనా నిబంధనలు నిర్లక్ష్యం వ్యహిస్తే వారిపై నేరేడ్మెట్ పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశానుసారం ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలో, కాలనీలలో తనిఖీలు చేస్తూ మాస్కులు, కర్ఫ్యూ నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పిస్తూ పెట్టి కేసు నమోదు చేస్తున్నామని సిఐ నరసింహ స్వామి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 68, బౌతిక దూరం పాటించని వారిపై 15, గుంపులు గుంపులుగా తిరుగు తున్న వారిపై 9, కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై2, ప్రధాన రహదారిపై పాన్ గుట్కా వేసుకొని ఉమ్మేసిన వ్యక్తిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...