Followers

సింగరేణి లో రక్షణ చర్యలు తీసుకోవాలి

 సింగరేణి లో రక్షణ చర్యలు తీసుకోవాలి

టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో వినతి

బెల్లంపల్లి , పెన్  పవర్

 సింగరేణి వణికిస్తున్న తరుణంలో ఎండలు పెరుగుతున్న కారణంగా కరోనా కూడా విజృంభిస్తు కావున సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఇతర డిపార్ట్మెంట్లలో పని చేస్తున్నా కార్మికులకు వైరస్ సోకకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి ఆసుపత్రి పర్యవేక్షణా ధికారికి వినతిపత్రం అందజేశారు, అనంతరం ఉపాధ్యక్షులు మనిరామ్ సింగ్ మాట్లాడుతూ  శానిటైజర్లు మాస్కులు ఉచితంగా కార్మికులకు అందించాలని,కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా వైరస్ కార్మికులకు వ్యాధి వ్యాపించి నట్లయితే జాతీయ విపత్తు చట్టం 1897 ప్రకారంగా సింగరేణిలో కార్మికులకు వేతనాలు కట్టి ఇవ్వాలని అన్నారు కార్మికులు కరోనా బారినపడి చనిపోయినట్లు అయితే గని ప్రమాదంగా గుర్తించాలని, కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంతరం ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు అమానుల్లాఖాన్ ,దుర్గం రాజయ్య, బొల్లు మల్లయ్య, రియాజ్, తలారి రాజు, సుధాకర్, అశోక్, భూపతి, తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...