Followers

డ్యూటీ నర్సులకు ఎన్ని తిప్పలో..?

 డ్యూటీ నర్సులకు ఎన్ని తిప్పలో..?

అకామిడేషన్ పేరుతో శ్రమను దోచుకుంటున్న ఆసుపత్రి బాసులు..??

దాదాపు రోజుకు 12గంటల పనివేళ్లలు..ఇలా చేస్తే..ఆరోగ్య పరిస్థితి ఏమిటీ???

కొన్ని వైద్యశాలలో నర్సులకు అసలుఆరోగ్య రక్షిత కిట్లు ఇస్తున్నారా..???

12గంటలు డ్యూటీ చేసి..కంటిన్యూగా రాత్రిలో డ్యూటీనా..???

రాత్రి సమయంలో ఎటువంటి భద్రత లేకుండా నర్సును ఒంటరిగా కోవిడ్ డ్యూటీ రప్పించడం భావ్యమా..???

వైద్యశాలలు నిర్వహిస్తున్న డాక్టర్లకు విశ్రాంతి అవసరం..??అకామిడేషన్ పేరుతో ఇలా నర్సులతో కంటిన్యూగా డ్యూటీ చేప్పించడం ఎంత వరకు సబబు???                               ఆప్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి ప్రశ్న

పెన్ పవర్, హైదరాబాద్

 నేడు తెలుగు రాష్ట్రాలలో, జిల్లాలో ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ లపై కోవీడ్ మహమ్మారి సందర్బంగా జరిగే అవినీతి పై విజిలెన్స్ దాడి చేస్తుడడం  సంతోషం.. అలాగే వాటిల్లో పని చేసే డ్యూటీ నర్స్ ల సమస్యలను చూడాలని ఆప్స్ రాష్ట్ర అధ్యక్షులు "ఎన్.రాజా రెడ్డి" కోరారు. నేటి ప్రస్తుత సమాజంలో పుట్టగొడుగుల్లా ఆసుపత్రిలు వీధి ఒక్కటి చొప్పున కొలువై.. ప్రస్తుత తరుణంలో వారి వారి ప్రత్యేకతలతో ప్రత్యేక చికిత్సలతో ఓ హోదా తెచ్చుకుంటున్నారు అసలు విషయానికి వస్తే ఆసుపత్రిలో అన్ని వసతులు ఇస్తామని చెప్పి..రోజుకు 8గంటలు మాత్రమే పనిచేయు వేళలని యువతులకు చెప్పి చేర్చుకుంటుండడం..వీరి మాటలను నమ్మి అకామిడేషన్ మరియు పని చేయు సమయ వేళలు 8గంటలని చేరిన రోజు నుంచి నర్సులకు ఎన్ని బాధలో.. వీరి బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియదు..సార్ కు చెబితే ఏమంటావో.. ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు.. దిక్కుతోచని స్థితిలో ఎందరో..మరెందరో నర్సులు  మదనపడి పోతున్నారు. యాజమాన్యాలు ఒక్కసారి వారి కష్టాలను తెలుసుకుంటే నియమ నిబంధనలను గుణంగా పనిచేయు సమయం 8గంటలు కానీ పలు కార్పోరేట్ ఆసుపత్రిలో.. సాధారణ హాస్పిటల్స్ లో నర్సులతో అదనపు సమయంలో విధులు చేప్పించు కుంటూ..జోబులు నింపుకుంటున్న కొన్ని సాధారణ ఆసుపత్రులు..కొన్ని ఆసుపత్రుల్లో మరొక్క ముఖ్య విషయం ఏమనగా కొన్ని ఆసుపత్రుల్లో రోజుకు 50మంది కరోనా పేషంట్లు వస్తున్న నేపథ్యంలో   ఒక్క సెక్యూరిటీ ఉండరు..ఒక్క అటెండర్ ఉండరు.. ఒక్క స్వీపర్ ఉండరు..ముగ్గురు చేసే పనిని ఒక్కరితోనే పనిని చేప్పించుకుంటూ ..నర్సులకు పనివత్తిడి పెంచుతూ..తీవ్ర ఆరోగ్య పరిస్థితికి కారణం అవ్వుతున్నారని వారి తల్లిదండ్రుల వాదన. ఇక్కడ ఈ చిన్న వైద్యశాలల్లో నగర వాసులకు ఏదేని ఆరోగ్య సమస్యలు వచ్చినను ఇక్కడకు వస్తే తప్పకుండా నయం చేసి పంపిస్తారనే  వైద్యులుగా పేరుపొందిన వీరు.. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లేడీ నర్సును ఒంటరిగా కోవిడ్ పేషెంట్స్ లకు దెగ్గర డ్యూటీ నిర్వహిస్తున్నారో అంతుబట్టని విషయం.. అంతేకాకుండా లేడీ నర్సులకు ఆత్మరక్షణ కిట్లు ఉండవు..టైమ్ కు తిండి ఉండవు.. నిద్ర ఉండవు.. స్వంత పనులకు సమయం దొరకదు..ఇంత కఠినాటికఠినంగా ఎలా వీరి శ్రమను దోచుకుంటున్నారు. వైద్య శాలల్లో ఒక్కసారి విచారణ చేప్పట్టితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది..వైద్యశాలలు నిర్వహిస్తున్న వైద్యులు ఇంకనైన చొరవ తీసుకుని.. సంపాదనే ధ్యేయంగా కాకుండా..పనిచేస్తున్న లేడీ నర్సులపై పని భారాన్ని తగ్గించి..ఎంతవరకు అవసరమో అంతవరకు నర్సులను.. అటెండర్లను..సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి..విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కోవిడ్ ఆత్మరక్షణ పరికరాలను ఇచ్చి..నియమ నిబంధనలనుగుణంగా పని చేయు సమయంలో విధులు నిర్వహించేలా చొరవ తీసుకుని వారికి వేతనాలను ఇవ్వాలని వైద్యశాలను నిర్వహిస్తున్న వైద్యులు ఇంకనైన మేల్కొనకపోతే అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా రెడ్డి కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...