మానవ సేవే మాధవ సేవ అంటున్న దళారులను నమ్మకండి
కరోనా బారిన పడి మృతిచెందిన వారిని ఆసరాగా చేసుకుని మృతుని బందువులు నుంచి అక్రమ దోపిడికు గురౌతున్నారని, ఇకపై ఆటువంటివి పునరావృతం కాకూడదని రాజమహేంద్రవరం వైస్సార్సీపీ సిటీ కొ ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు.రాజమహేంద్రవరం నగరంలో ప్రతి ఒక్కరికి నేను అండగా ఉన్నానని, వైఎస్ఆర్సిపి పార్టీ మీకు తోడుగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శానిటైజర్ 100% వాడాలని డాక్టర్ ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం స్థానిక ఏ వి అప్పారావు రోడ్డు ఆకుల సత్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతుందని కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకున్న ఆకుల సత్యనారాయణ తెలుపరు.కోవిడ్ వైరస్ వచ్చి ఎవరైనా మృతి చెందితే అయ్యే ఖర్చు వైఎస్సార్సీపీ పార్టీ తరఫున మేమే ఖర్చు పెడతామన్నారు.కైలాస భూమిలో ఎవరైనా ఎక్కువ తీసుకుంటే మాకు తెలియపరచాలని ఆయన అన్నారు.తోరలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాము అని,పట్టపగలు వెంకట్రావు వారితో సంప్రదింపులు జరపడం ఆయన కూడా ముందుకు రావడం జరిగింది అని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంత్యక్రియలు(దహన సంస్కారాలు) నిర్వహించుకునే వారు స్వల్ప ఖర్చు మాత్రమే అని ఆయన వివరాలు ఈ సంధర్భంగా తెలియ జేశారు.ఈ సమావేశంలో రాజమహేంద్రవరం నగర వైస్సార్సీపీ అధ్యక్షులు నందెపు శ్రీను,మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీను,మహిళ నాయకురాలు ఉమా మహేశ్వరి,వైస్సార్సీపీ ఇంచార్జి గెడ్డం అనిల్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment