ఇండియన్ ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ కు ఘన స్వాగత సన్మానం
వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం
వన్ టౌన్ సిఐ రమేష్ బాబు
రామగుండం , పెన్ పవర్వ్యాయామం చేయడం ద్వారా ప్రశాంతతతో పాటు వ్యాధులను నిర్మూలించే శక్తి మెరుగుపడుతుందని ఇండియన్ ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పూర్తితో ప్రారంభమైన సైకిల్ యాత్ర శుక్రవారం గోదావరిఖనికి చేరుకోగ వన్ టౌన్ సీఐ రమేష్ బాబు మరియు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఐ భారత్ కు పులా మాల వేసి స్వాగతం పలికారు. సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఖచ్చితంగా వ్యాయమం చేయాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని అన్నారు. ఈ సందర్భంగా భారత్ యాదవ్ మాట్లాడుతూ రోజుకు 160 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా2400 కిలోమీటర్లు ప్రయాణం చేయడమే తన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉమాసాగర్ మరియు హోంగార్డు రామిల్ల రాజశేఖర్, ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాజీపేట జైపాల్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment