Followers

కార్పొరేట్ ఆసుపత్రులు కుట్ర..

 కార్పొరేట్ ఆసుపత్రులు కుట్ర..

ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీ..
అధిక బిల్లులు వసూళ్లు,..
ఔషధ అక్రమ నిల్వలపై,..

రాజమహేంద్రవరం, పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా రెండవ విపత్తులో ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీ మరియు అనుమతి పొందిన ఆసుపత్రిలో అధిక బిల్లులు వసూళ్లు మరియు ఔషధ అక్రమ నిల్వలపై బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి రొంగల గోపిశ్రీనివాస్ రీజనల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి యు.రవిప్రకాష్ కి  ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యానికి ప్రత్యేక అనుమతి ఇచ్చిన కార్పొరేట్ ఆస్పత్రిలో ఇష్టానుసారం ప్యాకేజీలు పెట్టి అడ్డగోలుగా ఆసుపత్రుల బిల్లులు వసూలు చేస్తున్నారని అంతే కాకుండా ఆరోగ్య శ్రీ లో వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారని,  వారు వసూలు చేస్తున్న అక్రమ బిల్లులకు ఆధారాలు లేకుండా ఉంచుటకు ఆన్లైన్ నగదు అంగీకరించకుండా నగదు మాత్రమే స్వీకరిస్తున్నారని. కార్పొరేట్ ఆసుపత్రులు కుట్రపూరితంగా బాధితులను దోచుకుంటున్నారని, అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల వివరాల డాష్ బోర్డ్ లు ఈ ఆసుపత్రి ఎక్కడ ప్రదర్శించడం లేదని ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారులు నామమాత్రంగా బెడ్ల సంఖ్య చెబుతున్నారు తప్ప మిగిలి ఉన్న సంఖ్య తెలియడంలేదని. అధిక బిల్లులు నిరోధించే బాధ్యత వారు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ జిల్లాలో కృత్రిమ ఔషధాల కొరత సృష్టిస్తున్నారని రెమిడీసివేర్, తోసిలిజుమాబ్,ఇటోలిజుమాబ్ ఇంజక్షన్లు గతంలో స్టాకులు పెట్టుకొని అమ్మకాలు చూపించి ఇపుడు లక్షల రూపాయలకు అమ్ముతున్నారని వాటిపై పర్యవేక్షించాల్సిన అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువలన పై అంశాలపై కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా ఆసుపత్రిగా అనుమతి పొందిన ఆసుపత్రులు మరియు ఔషధాలు ఇంజక్షన్ లు అధికంగా నిల్వ చేసిన స్టాకిస్ట్ లపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు మరింత విస్తృతం చేసి కేసులు వ్రాయాలని తెలియజేసారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు అన్ని ఆసుపత్రుల్లో కార్యకర్తలు పర్యవేక్షణ చేస్తున్నారని కేంద్రం తగిన ఔషధాలు ఆక్సీజన్ ట్యాంక్ లు పంపుతున్న ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వారిపై చర్యలకు పోరాటం చేస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు రొంగల గోపిశ్రీనివాస్ పత్రిక విలేకరులకు ఆయన ప్రెస్ నోట్ ధ్యారా తెలియజేసారు.

రహదారి పైకి కాలువల నీరు చెత్త పెరుకుని వ్యాధులు,దోమలతో ప్రజలు అవస్థలు

 రహదారి పైకి కాలువల నీరు చెత్త పెరుకుని వ్యాధులు,దోమలతో  ప్రజలు అవస్థలు

 

ధవలేశ్వరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం రూరల్ స్థానిక ధవళేశ్వరంలో కాలవలలో చెత్త   కూరుకుపోయి మరియు మురుకు నీరు అక్కడ స్థానిక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అని అక్కడ స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు రోడ్డు మీదకి కుళ్ళునీరు,దుర్గంధం తో చుట్టుపక్కల వ్యాపారస్తులు  ఇబ్బంది పడుతున్నట్టు,దోమలు, మరియు అనేక వ్యాధిలకు,ప్రస్తుత రోజుల్లో కరోన వైరస్ అధికంగా ఈ సమయంలో బ్లీచింగ్, పారిశుద్ధ్య పనులు కోనసాగించిన మరలా మామూలుగానే ఈ అపరిశుభ్రంగా మారుతుంది. అని ప్రతి రోజు కాలువలు తియ్యాలని ,పక్కన ఉన్న హోటల్స్ నిత్యవసర వస్తువులు షాపులకు వెళ్లాలంటే భయభ్రాంతులకు స్థానిక చంటి పిల్లలు అతిసార వ్యాధులకు గురిఅవుతున్నారు అని ప్రజలు వాపోతున్నారు. అధికారులు మా గోడు పట్టించుకుని మా ఆరోగ్యాలు కాపాడాలని అక్కడ స్థానికులు పత్రికలు ధ్యారా అధికారులకు తెలిపారు.

రాష్ట్రంలో మళ్ళీ ఉచిత బియ్యంతో పేద ప్రజలకు సీఎం అభయం

 రాష్ట్రంలో మళ్ళీ ఉచిత బియ్యంతో పేద ప్రజలకు సీఎం  అభయం 

గుడివాడ, పెన్ పవర్

రాష్ట్రంలో మళ్ళీ ఉచిత బియ్యంతో పేదప్రజలకు సీఎం జగన్మోహనరెడ్డి అభయమిచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. బియ్యం కార్డులున్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి 10 కిలోల చొప్పున సార్టెక్స్ స్వర్ణ రకం మధ్యస్థ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మే, జూన్ నెలల్లో ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసి పేదల ఆకలి తీర్చేందుకు దాదాపు రూ. 800 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల బియ్యం కార్డులు ఉన్నాయన్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 88 లక్షల బియ్యం కార్డులను మాత్రమే గుర్తించిందన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం 5 కేజీల బియ్యాన్ని మాత్రమే ఇస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించని మరో 59 లక్షల బియ్యం కార్డుల కుటుంబాలకు కూడా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోలకు అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తం 10 కిలోల బియ్యాన్ని కార్డుదారుల్లో ఒక్కో సభ్యుడికి ఉచితంగా అందించనున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చి 29 వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆంక్షలను విధించాయన్నారు. ఈ ఆంక్షల కారణంగా పేదలు ఉపాధికి దూరమయ్యారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి ఉచిత నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గత ఏడాది మార్చి నుండి నవంబర్ నెల వరకు 16 విడతలుగా పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కూడా బియ్యం కార్డుదారులను ఆదుకునేందుకు సీఎం జగన్మోహనరెడ్డి రెండు నెలల పాటు బియ్యం కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పేదలకు ఉపాధి తగ్గుతోందని, మరికొందరు పని ఉన్నా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. పేదలను మరింతగా ఆదుకునేందుకు సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. వచ్చే మే, జూన్ నెలల్లో జరిగే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బియ్యం కార్డుదారులందరూ వినియోగించుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు.

పలాసలో కోవిడ్ వైద్య సేవలు విస్తృతం

పలాసలో కోవిడ్ వైద్య సేవలు విస్తృతం 

పలాస, పెన్ పవర్

పలాస నియోజకవర్గంలో కోవిడ్ వైద్య సేవలు విస్తృత పరిచే ప్రక్రియలో భాగంగా పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, యస్.పీ.వీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు హరిపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రులలో మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు పర్యటించి కోవిడ్ ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడానికి ఆసుపత్రుల సామర్థ్యం, అవకాశాలను పరిశీలించారు.

 జిల్లా జాయింట్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రి, యస్.పీ.వీ ముల్టీ స్పెషలిటీ ఆసుపత్రులలో ఆక్సిజన్ సదుపాయం కల్పించి వీలైతే రెపటినుండే కోవిడ్ ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తేవాలని  అన్నారు. ఆయనతో పాటు పలాస, మందస తహశీల్దార్లు, మందస ఎంపీడీఓ, పలాస ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, పలాస మున్సిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆలస్యంగా కనువిప్పు..!

 ఆలస్యంగా కనువిప్పు..! 

జిల్లాలో 3 వేల పడకలతో..
కోవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభం..
జెఎన్టీయూలో అందుబాటులో 600 పడకలు..
కోవిడ్ లక్షణాలు లేని వారికి హోమ్ ఐసోలేషన్
ఇంటిలో ప్రత్యేక గది లేని వారికి కేర్ సెంటర్..
వ్యాధి తీవ్రత ఉన్న వారికి కోవిడ్ హాస్పిటల్లో చికిత్స..
జిల్లాలో 3 వేల పడకలతో..
మూడంచెల వ్యూహంతో..
కోవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభం..
జెఎన్టీయూలో అందుబాటులో 600 పడకలు..
కోవిడ్ లక్షణాలు లేని వారికి హోమ్ ఐసోలేషన్
ఇంటిలో ప్రత్యేక గది లేని వారికి కేర్ సెంటర్..
వ్యాధి తీవ్రత ఉన్న వారికి కోవిడ్ హాస్పిటల్లో చికిత్స..

మూడంచెల వ్యూహంతో..

విజయనగరం ప్రతినిధి, పెన్ పవర్

కోవిడ్ సెకెండ్ వేవ్ ధాటికి ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే..జిల్లా అధికార యంత్రంగా ఆలస్యంగా కళ్ళు తెరచింది. రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదై,  పదుల సంఖ్యలో కోవిడ్ మరణిస్తుంటే సరైన ప్రణాళిక లేక యంత్రాంగం ఇప్పటి వరకు చేష్టలుడిగి చూసింది. కోవిడ్ చావులను చూసి ప్రజలు బెంబేలెత్తి పోతుంటే ప్రజా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రెస్ అండ్ మీడియా ఎన్ని వాస్తవ కధనాలు ప్రచురించినా అటు పాలకుల్లో గానీ, ఇటు అధికారుల్లో గానీ కనీసం కదలిక రాలేదు. పైగా పర్య వేక్షణ లోపమో, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమో గానీ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఇటీవల ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు మరణించారని ప్రజా సంఘాలు గట్టిగా ఘోషిస్తున్నా, యంత్రాంగం మాత్రం అటువంటిది ఏమీ జరగలేదని బుకాయిస్తూనే వచ్చింది. అయితే అటు వంటి ఆక్సిజన్ సకాలంలో అందని లోపమే మళ్లీ కేంద్ర ఆసుపత్రిలో పునరావృతం కావడంతో యంత్రాంగం డొల్లతనం బయటపడింది. యంత్రాంగంలోని ఈ లోపాలతో పాటు జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల ఉధృతికి తగ్గ ఆసుపత్రులు, బెడ్ లు, ఆక్సిజన్ సరఫరా, రేమిడేసివర్ ఇంజెక్షన్ల కొరత, కృత్రిమ సృష్టితో బ్లాక్ లో మందుల విక్రయాలు, ఉచిత మందుల సరఫరాలో అవినీతి అక్రమాలు వంటి ఘటనలను ఉటంకిస్తూ 'పెన్ పవర్' పలు ప్రత్యేక వాస్తవ కథనాలను వెలుగులోకి తెచ్చింది. ఆ క్రమంలోనే కోవిడ్-19 మొదటి వేవ్ లో ఏర్పాటు చేసిన విధంగా తిరిగి ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తూ పెన్ పవర్.."క్వారంటైన్ కేంద్రాలు తెరవండి..ప్లీజ్" అంటూ ఏప్రిల్ 28న ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం అధికార యంత్రాంగంలో ఎంత వరకు కదలిక తెచ్చిందో తెలియదు గానీ వారిలో ఆలస్యంగా "కనువిప్పు" కలిగిందనే చెప్పుకోవాలి. ఈ మేరకు జిల్లాలో 3 వేల పడకలతో కోవిడ్ రోగ లక్షణాలు ఉన్న పెసెంట్స్ కోసం ప్రత్యేక క్వారంటైన్ కేర్ సెంటర్లని ప్రారంభిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్ ప్రకటించారు. అంతే కాకుండా విజయనగర శివారు ప్రాంతంలో ఉన్న సువిశాల జేఎన్టీయూ క్యాంపస్ లో 600 పడకలతో క్వారంటైన్ కేర్ సెంటర్ ని కూడా శుక్రవారం ప్రారంభించారు. అలాగే మరో మూడు సెంటర్లలో 400 పడకలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఈ నాలుగు క్వారంటైన్ కేర్ యూనిట్లలో వెయ్యి పడకలు అందుబాటులో ఉంచినట్టు వారు తెలిపారు. ఈ కేర్ సెంట‌ర్ల  వద్ద ప్రత్యేక చికిత్స గది, పిపిఇ కిట్లు, మందులు, కోవిడ్ కిట్లు, ఆక్సీజ‌న్ సిలండ‌ర్లు, ఇసిజి, మెనూ బోర్డులు, రూముల్లోని ప‌డ‌క‌ల ఏర్పాటు చేశారు.

అదేవిధంగా ప్ర‌భుత్వం నిర్ధేశించిన విధంగా ఒక్కో రోగికి రోజుకు సుమారు రూ.300 ఖ‌ర్చులో మంచి పోష‌కాహార భోజ‌నాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేర్ సెంట‌ర్ల వ‌ద్ద అవ‌స‌ర‌మైన‌ స‌మ‌యంలో వినియోగించుకొనేందుకు ఆక్సీజ‌న్ స‌దుపాయం కూడా ఉంటుందని కలెక్టర్, ఎంపీ తెలిపారు. రోగుల‌ను అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు అంబులెన్సుల‌ను కూడా సిద్దంగా ఉంచుతున్న‌ట్లు చెప్పారు. క‌రోనా సోకితే భ‌య‌ప‌డ‌కుండా ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. జిల్లా ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్ కొర‌త లేద‌న్నారు. మరో వైపు జిల్లా కేంద్రాసుప‌త్రిలో ఆక్సీజ‌న్ నిల్వ సామ‌ర్థ్యాన్ని 2వేల కిలో లీట‌ర్ల నుంచి 8 వేల కిలోలీట‌ర్ల‌కు పెంచుతున్న‌ట్లు చెప్పారు. జిల్లా 3 వేల పడకలతో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లుని మూడంచెల వ్యూహంతో నిర్వహించనున్నారు. వ్యాధి సోకిన వారికి మూడు ప‌ద్ద‌తుల ద్వారా చికిత్స‌ను అందించనున్నారు. పాజిటివ్ ఐనా ఎటువంటి ల‌క్ష‌ణాలు లేనివారిని హోం ఐసోలేష‌న్‌లోనే ఉంచి, వారికి వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందిస్తారు. 104 ద్వారా రిజిస్టర్ అయిన వీరికి 3 గంట‌ల్లోనే కోవిడ్ కిట్ల‌ను అంద‌జేస్తారు. కోవిడ్ లక్షణాలు కలిగి ఇళ్ల‌లో ఏకాంతంగా ఉండే అవ‌కాశం లేనివారిని కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించి, చికిత్స‌ను అందించనున్నారు. మూడోదిగా ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉన్న‌వారిని కోవిడ్‌ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టికే 30 ఆసుప‌త్రుల‌ను సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. 14 ప్ర‌భుత్వ ఆసుప్ర‌తులతోపాటు, 16 ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లోని 2,098 ప‌డ‌క‌ల‌ను సిద్దం చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు, సాంకేతిక నిపుణులు, న‌ర్సులు త‌దిత‌ర సిబ్బంది కూడా సిద్దంగా ఉన్నార‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు డెత్ ఆడిట్‌ను నిర్వ‌హిస్తూ, మ‌ర‌ణాల‌పై విశ్లేష‌ణ కూడా జ‌రుపుతున్నట్టు క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

జుత్తాడ బాధిత కుటుంబాలకు 12లక్షల చెక్కును అందజేసిన విజయసాయి రెడ్డి

జుత్తాడ బాధిత కుటుంబాలకు 12లక్షల చెక్కును అందజేసిన విజయసాయి రెడ్డి

విశాఖ తూర్పు, పెన్ పవర్

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వైకాపా జాతీయ కార్యదర్శి,వైకాపా రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. పెందుర్తి మండలం జుత్తాడ హత్యాకాండలో బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరుపున  మృతులు ఒక్కొక్కరికి 2 లక్షలు చొప్పున మొత్తం 12 లక్షల చెక్కును శివజీపాలెం లోని బాధిత కుటుంబ సభ్యుల నివాసంలో  శుక్రవారం ఉదయం అందజేశారు.

 అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఏ1( అప్పలరాజు)ని ఇప్పటికీ పోలీస్ కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. ఏ2 (బత్తిన శ్రీను) హోమ్ గార్డును విధులు నుండి తొలగించి విచారణ  చేపడుతున్నట్లు తెలిపారు. ఏ3, ఏ4 లను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలకు త్వరిత గతిన న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో నగర మేయర్ గోలగాని వెంకట హరి కుమారి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, నగర వైకాపా పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఏరియాలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి

 ఏరియాలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి

--ఏరియా జిఎం చింతల శ్రీనివాస్


పెన్ పవర్,  మందమర్రి 

మందమర్రి ఏరియాలో ఏప్రిల్ మాసంలో  94 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిఎం కార్యాలయం లో ఏప్రిల్ మాసం రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, కరోన కు సంబంధించిన అంశాలను వీడియో ద్వారా విలేకర్లకు తెలియపరిచారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ మాసంలో ఏరియాలోని కేకే 1 గని 104శాతం, ఆర్కేపి ఓసిపి గని 125 ఉత్పత్తి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ మాసంలో  ఏరియాలోని  కేకే-1 గని 104శాతం ఉత్పత్తి సాధించగా,కేకే-5 గని 83శాతం,ఆర్కే 1ఎ గని 87శాతం,కాసిపేట గని 61శాతం, కాసిపేట-2 గని 46శాతం, శాంతిఖని గని 50శాతం, కేకే ఓసిపి 95శాతం, ఆర్కే ఓసిపి 125శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. మార్చి నెలలో భూగర్భ గనుల ద్వారా 72 శాతం ఉత్పత్తి సాధించగా, ఓసిపి ల ద్యారా 102 శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. ఏప్రిల్ మాసంలో 2.25 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా, రైలు మార్గం ద్వారా 53 రేకులతో 2.14 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు,28.34 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా కరోనా ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏరియాలో సింగరేణి కార్మికులకు కరోనా వైరస్ బారిన పడితే  చికిత్స అందించేందుకు రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ, ఐసొల్యూషన్ రెండు విభాగాల్లో 103 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా క్వారెంటైన్ కేంద్రాలు ఆర్కేసిఎంఓ క్లబ్ 70,కమ్యూనిటీ హాల్ 40 మొత్తం 110 అందుబాటులో ఉన్నాయని,కరోనా ను ఎదుర్కొంనెందుకు  ఏరియాల్లో మొత్తం 213 బెడ్లు అందుబాటులో ఉంచినట్లు,ఆక్సిజన్ సిలిండర్లు, మందులు కూడా సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. ఏరియా ఏరియా ఆస్పత్రిలో చేపట్టిన చర్యల పై సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాం సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఏరియాలో కరోన వ్యాక్సినేషన్ ప్రక్రియ 22% అయిందని మే 31 వరకు 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  మే 1 నుండి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మికులు కరోనా వ్యాక్సిన్ అపోహలు వీడి వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోన వైరస్ బారినపడిన ప్రాణాపాయం నుండి బయట పడవచ్చని ఆయన సూచించారు.గనులలో కరోన నివారణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కార్మికులు సైతం పని స్థలాల్లో, ఇంటి వద్ద, బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావాలని, డ్యూటీకి, ఇంటికే పరిమితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఇంచార్జ్ పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాం సుందర్, డివైఎస్ఈ (ఐఈ) ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...