Followers

మేయర్ ను కలిసిన బెహరా

 మేయర్ ను కలిసిన బెహరా

మహారాణి పేట, పెన్ పవర్

మేయర్ ను కలిసిన బెహరా గోపాలపట్నం ప్రజా మాట   విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని ఆమె కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు జీవీఎంసీ కోఆప్షన్ మెంబెర్ బెహరా భాస్కరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రోజురోజుకు విజృంభణ కారణంగా వ్యాక్సిన్ పెంచాలని 91మరియు 92 వార్డులలో జరిగే అభివృద్ధి నిధులు పెంచాలని ముఖ్యంగా 91వ వార్డు పరిధి గోపాలపట్నం స్మశానం పనులు వేగవంతం చేయాలని అలాగే వ్యాక్సిన్ డోసులు పెంచి ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కంపర.సత్తిబాబు, వైయస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి 

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

నిరంతరం ప్రభుత్వం అప్పగించిన ఎన్నికల విధులు, పరీక్షల విధులు, నాడు- నేడు విధులు,కరోనా విధులు మొదలైన ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఫోరమ్ ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఫోర్టో)  రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర ఛైర్మన్ కరణం హరికృష్ణ , సెక్రెటరీ జనరల్  సామల సింహాచలం ఒక ప్రకటన లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఇటీవల ఎన్నికల విధులు, పాఠశాల విధులకు హాజరై కరోనా మహమ్మారి కాటుకు బలి అయిన  టీచర్ల కుటుంబాలకు ఏభై లక్షలు సహాయం అందించి, కుటుంబ సభ్యులకు త్వరితగతిన కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అంతే కాకుండా కొన్ని వేల మంది టీచర్లు కరోనా వ్యాధి సోకి ఆసుపత్రుల పాలై ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక కోవిడ్ వైద్య సదుపాయాల కొరకు బెడ్స్ కేటాయించాలని, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫోర్టో రాష్ట్ర ముఖ్య సలహాదారు గాండ్లపర్తి శివానంద రెడ్డి, మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్, మహిళా నేత డి. విజయ లక్ష్మి తదితరులు ఉన్నారు.

ఘనంగా మహా కవి శ్రీ శ్రీ 113 వ జయంతి వేడుకలు

ఘనంగా మహా కవి శ్రీ శ్రీ 113 వ జయంతి వేడుకలు

పరవాడ, పెన్ పవర్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో లో మహాకవి శ్రీ శ్రీ 113వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి 79 వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ శ్రీ రౌతు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రౌతు మాట్లాడుతూ విశాఖఉక్కు కార్మికులు 78 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం ఎంతో విచారకరమని ఆయన అన్నారు.భవిష్యత్తులో స్టీల్ భవిష్యత్ పరిరక్షణ కమిటీ ఏ పిలుపు ఇచ్చిన దానికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని రౌతు శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి నాయకులు కామ్రేడ్ డి. ఆదినారాయణ.జె. రామ కృష్ణ,సిఐటియు నాయకులు వై. టి .దాస్, జె.అయోధ్య రామ్, ఐ ఎన్ టి యు సి నాయకులు గంధం వెంకట్రావు,సంపూర్ణ టి.ఎన్ .టి. యు సి.నాయకులు విల్లా రామ్మోహన్ కుమార్,  హెచ్ ఎం ఎస్ నాయకులు దొమ్మేటి అప్పారావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

4వ వార్డులో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయించిన కౌన్సిలర్.

 4వ వార్డులో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయించిన కౌన్సిలర్...

పెన్ పవర్, మేడ్చల్

రోజు రోజుకు కరోన సెకండ్ వేవ్ విజృబింస్తున వేళా ప్రజల ఆరోగ్యని దృష్టిలో ఉంచుకుని కార్మిక శాఖ మంత్రి మాల్లారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, సహకారంతో కౌన్సిలర్ తుడుం గణేష్  ఆధ్వర్యంలో 4 వ వార్డులో హైడ్రో క్లోరిన్ ఆమ్లని, పిచికారి చేయించారు. ఈ సందర్భంగా 4 వ వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోన వైరస్ సెకండ్ వేవ్ ప్రబలుతున్న వేళా అనేక మంది ప్రాణాలు తీస్తున్న  మనం కరోన వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసరమైతే తప్పా ఇంట్లో నుండి బయటకు రాకూడదు అలాగే ఎల్లప్పుడూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ వాడాలని ముఖ్యంగా చిన్నపిల్లలు వయసు పైబడిన వాళ్ళు వైరస్ అధికంగా సోకే లక్షణాలు ఉన్నందున వారు బయటకు రాకుండా చూడాలని అలాగే షాపు యజమానులు శానిటైజర్ వాడుతు వినియోగదారులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించినవారికి మాత్రమే సరుకులు ఇవ్వాలని లేదా షాపు యజమానులకు జరిమానా విధించబడుతుంది అని కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు.

వదల బొమ్మాళి.. ..

వదల బొమ్మాళి.. 
కరోనా కాటుకు  తండ్రి కొడుకులు మృతి

సంతబొమ్మాళి, పెన్ పవర్

సంతబొమ్మాలి ని కరోనా వదలను అంటుంది. జాగ్రత్తలు  పాటించకుంటే! అమ్మ లేదు, నాన్న లేదు, అక్క, చెల్లి తంబి లేదు. నా దగ్గర ఎవరైనా ఒకటే. వివరాల్లోకి వెళితే  కరోనా తో ఐదు  రోజుల వ్యవధి లోనే తండ్రి కొడుకు మరణించిన ఉదంతం సంతబొమ్మాళి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ ఉమా పాలేశ్వర స్వామి ఆలయం ధర్మకర్తఅయిన  కొండాల గణపతి రావు గురువారం రాత్రి కన్నుమూశారు. పది రోజులు క్రితం కరోనా లక్షణాలు తో  గణపతి రావు తో పాటు భార్య, కుమారుడు శ్రీకాకుళం లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి లో చికిత్స కోసం చేరారు.అయితే ఇదే ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న గణపతి రావు పెద్దకుమారుడు ఐదు  రోజుల క్రితం గత శనివారం మరణించాడు.కొడుకు చనిపోయిన విషయం తండ్రి కి కుటుంబ సభ్యులు తెలియనీయలేదు .  ఆవిషయం గ్రామస్తులు ఇంకా  మరువక ముందే గణపతి రావు కన్ను మూయడం తో సంతబొమ్మాళి లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు మరి  కొంతమంది బంధువులు పిపి కిట్లు వేసుకొని  ఆయన పార్ధవ దేహాన్ని సంతబొమ్మాళి తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా భయం ఉన్నప్పటికీ పలువురు అభిమానులు అంత్యక్రియలు  సుదూరంలో ఉండి చూసారు.    గణపతిరావు  గ్రామాభివృద్ధి తో పాటు దేవాలయాలు అభివృద్ధి,  పూజా కార్యక్రమా ల్లో ముందుండి నడిపించే వారు.  గ్రామం లో వెలసిన అతి పురాతన శ్రీ ఉమా పాలేశ్వరస్వామి దేవాలయం నుఏడాది క్రితం నుంచి  లక్షలు వెచ్చించి నూతనంగా ఆలయం గా రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించి పదిమందికి ఆదర్శ oగా నిలిచారు.గ్రామ పెద్దలకు, యువకులు లకు తలలో నాలుకగా మెలిగిన గణపతి రావు ఇకలేరు అనేవిషయం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా అందరూ మాస్కు ధరించి తోటివారికి సహకరిస్తారని పోలీసులు, వైద్య సిబ్బంది మరియు పాత్రికేయులు కోరుకుంటున్నారు.

 

క‌రోనాను ఎదుర్కొన‌డానికి సిద్దంగా ఉన్నాం

క‌రోనాను ఎదుర్కొన‌డానికి సిద్దంగా ఉన్నాం

3వేల ప‌డ‌క‌ల‌తో కోవిడ్ కేర్ సెంట‌ర్లు
కోవిడ్ క‌ట్ట‌డికి మూడంచెల వ్యూహం

విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్

క‌రోనా రాకుండా అన్ని ర‌కాల ముందుజాగ్రత్త‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఒక‌వేళ వ‌స్తే దైర్యంగా ఉండాల‌ని విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ సూచించారు. ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కొన‌డానికి జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌తో క‌లిసి జెఎన్‌టియు కోవిడ్ కేర్‌సెంట‌ర్‌ను ఆయ‌న శుక్ర‌వారం ప‌రిశీలించారు. కేర్ సెంట‌ర్‌వ‌ద్ద ఏర్పాటు చేసిన ఆసుప‌త్రి, పిపిఇ కిట్లు, మందులు, కోవిడ్ కిట్లు, ఆక్సీజ‌న్ సిలండ‌ర్లు, ఇసిజి, మెనూ బోర్డులు, రూముల్లోని ప‌డ‌క‌ల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, ఎంపి సంతృప్తిని వ్య‌క్తం చేశారు.

 ఈ సంద‌ర్భంగా ఎంపి బెల్లాన మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు కోవిడ్‌ను ఎదుర్కొన‌డానికి జిల్లా యంత్రాంగం అన్నివిధాలా సంసిద్దంగా ఉంద‌ని అన్నారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3వేల ప‌డ‌క‌ల‌తో కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇప్ప‌టికే సుమారు 1000 ప‌డ‌క‌ల‌తో నాలుగు చోట్ల కేర్ సెంట‌ర్లు సిద్దం చేశామ‌న్నారు. విజ‌య‌న‌గ‌రంలోని గిరిజ‌న్ భ‌వ‌న్‌లో 66 ప‌డక‌లు, జెఎన్‌టియులో 600 ప‌డ‌క‌లు, బొబ్బిలిలో జ‌న‌హిత డైట్ కాలేజ్‌లో 100, ట్రైబ‌ల్ వెల్ఫేర్ స్కూల్‌లో 250 ప‌డ‌క‌ల‌తో సెంట‌ర్ల‌ను సిద్దం చేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వం నిర్ధేశించిన విధంగా ఒక్కో రోగికి రోజుకు సుమారు రూ.300 ఖ‌ర్చులో మంచి పోష‌కాహార భోజ‌నాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఈ కేర్ సెంట‌ర్ల వ‌ద్ద అవ‌స‌ర‌మైన‌ స‌మ‌యంలో వినియోగించుకొనేందుకు ఆక్సీజ‌న్ స‌దుపాయం కూడా ఉంద‌ని, రోగుల‌ను అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు అంబులెన్సుల‌ను కూడా సిద్దంగా ఉంచుతున్న‌ట్లు చెప్పారు. క‌రోనా సోకితే భ‌య‌ప‌డ‌కుండా ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. జిల్లా ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్ కొర‌త లేద‌న్నారు. జిల్లా కేంద్రాసుప‌త్రిలో ఆక్సీజ‌న్ నిల్వ సామ‌ర్థ్యాన్ని 2వేల కిలో లీట‌ర్ల నుంచి 8 వేల కిలోలీట‌ర్ల‌కు పెంచుతున్న‌ట్లు చెప్పారు. రోగులు ఆసుప‌త్రిలో ఆక్సీజ‌న్‌ను వృధా చేయ‌వ‌ద్ద‌ని ఎంపి కోరారు.

  క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్‌ను క‌ట్ట‌డి చేసేందుకు మూడంచెల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. క‌రోనా నివార‌ణా చ‌ర్య‌ల్లో భాగంగా, ఈ వ్యాధి ప‌ట్ల‌ విస్తృత‌మైన అవ‌గాహ‌న‌ను పెంపొందించ‌డం, మాస్కుల‌ను ధ‌రించాల‌ని, శానిటైజ‌ర్లు వాడాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని ప్ర‌చారం చేస్తున్న‌ట్లు చెప్పారు. మ‌రోవైపు వేక్సినేష‌న్‌ను కార్య‌క్ర‌మాన్ని విస్తృతం చేశామ‌న్నారు. ఫ్రంట్‌లైన్ వారియ‌ర్ల‌తోపాటుగా, 45 ఏళ్లు పైబ‌డిన ప్ర‌తీఒక్క‌రికీ వేక్సిన్ వేస్తున్నామ‌ని, 18 ఏళ్లు పైబ‌డిన వారికి రిజిష్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది స‌హ‌కారంతో కంటైన్‌మెంట్ స్ట్రాట‌జీని ప‌క‌డ్భంధీగా అమ‌లు చేస్తూ, వ్యాధి ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించ‌కుండా క‌ట్టుధిట్టం చేస్తున్నామ‌న్నారు.వ్యాధి సోకిన వారికి మూడు ప‌ద్ద‌తుల ద్వారా చికిత్స‌ను అందిస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. ఎటువంటి ల‌క్ష‌ణాలు లేనివారిని హోం ఐసోలేష‌న్‌లోనే ఉంచి, వారికి వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స చేస్తున్నామ‌న్నారు. వీరికి ముఖ్య‌మంత్రి ఆదేశాల‌కు అనుగుణంగా 3 గంట‌ల్లోనే కోవిడ్ కిట్ల‌ను అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. 

ఇళ్ల‌లో ఏకాంతంగా ఉండే అవ‌కాశం లేనివారిని కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించి, చికిత్స‌ను అందిస్తున్నామ‌న్నారు. ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉన్న‌వారిని కోవిడ్‌ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నామ‌న్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టికే 30 ఆసుప‌త్రుల‌ను సిద్దం చేశామ‌ని, 14 ప్ర‌భుత్వ ఆసుప్ర‌తులతోపాటు, 16 ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లోని 2,098 ప‌డ‌క‌ల‌ను సిద్దం చేసి చికిత్స చేయిస్తున్నామ‌ని చెప్పారు. వైద్యులు, సాంకేతిక నిపుణులు, న‌ర్సులు త‌దిత‌ర సిబ్బంది కూడా సిద్దంగా ఉన్నార‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు డెత్ ఆడిట్‌ను నిర్వ‌హిస్తూ, మ‌ర‌ణాల‌పై విశ్లేష‌ణ కూడా జ‌రుపుతున్నామ‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, విజ‌య‌న‌గ‌రం డిఎస్‌పి పి.అనిల్‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు, ఎంపిడిఓ చైనులు, సిఐ మంగ‌వేణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

విద్యార్థులు కు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు పంపిణీ

 విద్యార్థులు కు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు పంపిణీ

పరవాడ, పెన్ పవర్

గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో 10 తరగతి  మరియు ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు ఎదుగుదలకు ఉపయోగపడే మార్గదర్శకాలను విద్యార్థుల భవిష్య  దిక్సూచి అనే పుస్తకం ను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు లుపిన్ హ్యూమన్ వెల్ఫేర్ & రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా పంపిణీ చేయడం జరిగింది.కోవిడ్  నియమ నిబంధనలను పాటిస్తూ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతీ విద్యార్థి కి వారియొక్క జీవిత లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కెరీర్ గైడెన్స్ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అని లుపిన్ ఫౌండేషన్ ప్రతినిధి ఎస్. అర్జున  చెప్పారు.10 తరగతి మరియు ఆ పైన చదువుతున్న విద్యార్థులు కు విద్యావకాశాలు మరియు ఉద్యోగావకాశాల కోసం ఈ పుస్తకం ఒక మంచి దిక్సూచి లా ఉపయోగపడుతుందని  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జి. వెంకట రావు చెప్పారు.  ఈ కార్యక్రమాన్ని పరవాడ మండలం లో  గవర్నమెంట్ హై స్కూల్, తానాం, జెడ్ పి హై స్కూల్స్,లంకెల పాలెం,  లేమర్తి మరియు పరవాడ బాయ్స్ & గర్ల్స్ హై స్కూల్  లో 10 వ తరగతి చదువుతున్న  సుమారు  450 మంది  విద్యార్థుల కు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు ను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  తానాం హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ బి. చిట్టిబాబు మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థుల కు కెరీర్ గైడెన్స్ చాలా అవసరం అని ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవడానికి ఈ విద్యార్థులు భవిష్య దిక్సూచి పుస్తకం చాలా ఉపయోగం అని అన్నారు.హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు లుపిన్ ఫౌండేషన్ వారి కృషి ని ప్రత్యేకంగా అభినందించారు.ట్రస్ట్ కార్యదర్శి ఎస్. అచ్చిబాబు మరియు హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆర్. నాగేశ్వరరావు, బి. సురేఖ, పి. కుమారి మరియు ఉపాధ్యాయ సిబ్బంది  పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...