Followers

బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

 బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు...

బేల, పెన్ పవర్

ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ గుండావార్  తండ్రి, మండలంలోని పాటన్ గ్రామానికి చెందిన కొప్పుల్వర్ రామన్న అనారోగ్యంతో  మరణించడంతో బుధవారం వారి కుటుంబాలను తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణానికి గల కారణం అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ఆదిలాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ జైనాథ్ మండల అధ్యక్షుడు కల్చప్ రెడ్డి, బేల మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాందాస్ నక్లే, కాంగ్రెస్ పార్టీ నాయకులు వమాన్ వాంఖడే, పాఠన్ సర్పంచ్ ఫైజుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...