Followers

సకల వర్గాల సంక్షేమ బడ్జెట్ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

 సకల వర్గాల సంక్షేమ బడ్జెట్ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

పెన్ పవర్ , జగిత్యాల

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ఆశాజనకంగా ఉందని, సామాన్యప్రజలకు సైతం ఎంతో మేలు చేసేలా ఉందని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు,ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.రాష్ట్ర జీడీపీ ఆశాజనకంగా ఉండటంతో ఈసారి అన్ని వర్గాలకు మేలు చేకూరనుందని ఒక్క జగిత్యాల జిల్లాకే ఈ సంవత్సరంకు 250 కోట్లు రావటం సంతోషంగా ఉందని అన్నారు. ఎప్పటి మాదిరిగానే పల్లెల్లో మౌళిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తూనే..జిల్లా పరిషత్,మండల పరిషత్ లకు నిధులు కేటాయించటం పై హర్షం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేలకు సైతం 5 కోట్లు కేటాయింపులు జరిపారని,విద్య,వైద్యానికి ప్రాధాన్యం ఇస్తూనే వ్యవసాయ పనిముట్ల యాంత్రీకరణ,రైతు భీమా కు,మార్కెట్ల అభివృద్ధికి సైతం నిధుల కేటాయింపులతో ఎంతో మేలు జరగనుందన్నారు.సకల వర్గాల సంక్షేమ బడ్జెట్ అని అభిప్రాయపడింది. ఎమ్మెల్యే జిల్లాకు సైతం అత్యధిక మేలు చేకూరుతుండటంపై సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...