Followers

భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్సై  రవీంద్రారెడ్డి


భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్సై  రవీంద్రారెడ్డి


 


బేస్తవారిపేట, పెన్ పవర్


 

 బేస్తవారిపేట పట్టణంలో శుక్రవారం బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి రెడ్ జోన్, బఫర్ జోన్, కంటోన్మెంట్ జోనల్ లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బేస్తవారపేట పట్టణంలోని రాణిపేట లైన్, గాంధీ బజారు, ఆంజనేయులుస్వామి బజారులో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడ రెడ్ జోన్, కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి ఎస్సై రవీంద్రారెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఈ సందర్భంగా తన సిబ్బందితో బయటి వారిని ఎవరినీ కంటోన్మెంట్ జోన్ లోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే కంటోన్మెంట్లో నుండి కూడా ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...