తిరుమల వద్ద రోడ్డు ప్రమాదం లో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ మృతి
ఏలేశ్వరం,పెన్ పవర్మండల పరిధిలోని తిరుమల గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగిడి సూరిబాబు (39) మృతి చెందారు. ఏలేశ్వరం నుండి ఎర్రవరం వైపు వెళ్లే ఆర్అండ్బీ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం తిరుమాలి వద్ద చోటు చేసుకుంది. ఈ మేరకు ఏలేశ్వరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ జంగిడి సూరిబాబు (39) రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్లో గార్డ్ విధులు నిర్వహించి తిరిగి కాకినాడ ఏపీఎస్పీ క్వార్టర్స్ కి వెళుతుండగా ఏలేశ్వరం మండలం తిరుమాలి వద్ద ఎదురుగా వస్తున్న క్వారీలారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది అన్నారు. మృతుడి స్వస్థలం విశాఖ జిల్లా పాడేరు మండలం జల్లుపల్లి గ్రామం కాగా 2007వ సంవత్సరంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడన్నారు. మృతునికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు తరలించినట్లు ఆయన తెలిపారు.

No comments:
Post a Comment