అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం
ఏలేశ్వరం,పెన్ పవర్మండలం లోని భద్ర వరం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వము నష్టపోయిన బాధితులకు పలువురు యువకులు ఆర్థిక సాయం అందించారు. భద్ర పురం గ్రామానికి చెందిన సబ్బి చిన్న రాజు కు చెందిన ఇల్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా ఆహుతి అవగా, ఇంట్లో చిన్న రాజు తన కుమారుని గుండె ఆపరేషన్ నిమిత్తం దాచుకున్న నాలుగు లక్షల రూపాయలు అగ్ని లో దహనం అయ్యాయి.
దీంతో తన కుమారుడికి ఆపరేషన్ చేయించడానికి ఇబ్బంది పడుతున్న చిన్న రాజు ను చూసి యువకులు చిక్కాల నాని బాబు, ఒంపు గల శ్రీకాంత్, ఉపాధ్యాయుడు గండ్ర టీ వీరబాబు తదితరులు విరాళం సేకరించి, దానికి తమ వంతు సహాయం కలిపి 54 వేల రూపాయలు స్థానిక శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ చేతుల మీదుగా చిన్న రాజు కు అందించారు.


No comments:
Post a Comment