రాజకీయాలకు అతీతంగా ఏలేశ్వరం అభివృద్ధి పరుస్తా
ఏలేశ్వరం,పెన్ పవర్రాజకీయాలకు అతీతంగా ఏలేశ్వరం నగర అభివృద్ధి పరుస్తానని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికలు లో విజయం అనంతరం స్థానిక బాలాజీ ఛౌక్ సెంటర్లో విజయోత్సవ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేను వైసీపీ శ్రేణులు వేదికపై ఎమ్మెల్యేకు గజమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు ఎంత వరకు మాత్రమే రాజకీయమని అనంతరం ప్రజలు అంతా సమానమే అని అన్నారు. తమ పార్టీ కౌన్సిలర్ తో సమానంగా ప్రతిపక్ష టిడిపికి చెందిన కౌన్సిలర్ ను కూడా సమానంగా ఆదరిస్తారని పార్టీలకతీతంగా వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయని అన్నారు. తనపై నమ్మకం ఉంచి నగర పంచాయతీ ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ వైసీపీ నాయకులు అలమండ చలమయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజలు చాలా నష్టపోయారని తమ ప్రభుత్వ హయాంలో నగర అభివృద్ధి తో పాటు పురప్రజలకు అందరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా పాలన జరుగుతుందన్నారు. ఈ విజయోత్సవ సభలో వైసిపి నాయకులు శిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, మూది నారాయణస్వామి, తదితరులతో పాటు 16 వార్డుల లో గెలుపొందిన వైసిపి కౌన్సిలర్లు వేదికపై ఉన్నారు.

No comments:
Post a Comment