Followers

నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం.....

నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం.....

పెన్ పవర్, ఉలవపాడు 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులు పండించిన పంట ను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఆసరాగా నిలిచే విధంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉలవపాడు మండలం లోని 4  సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం బుధవారం డి ఆర్ డి ఏ, వైయస్సార్ క్రాంతి పథకం ఆధ్వర్యంలో కరేడు సంబంధించి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉప్పరపాలెం దగ్గర్లో రైతులకు అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బద్దిపూడి గ్రామపంచాయతీ పరిధిలోని శివాలయం దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు. మరియు భీమవరం పంచాయతీ పరిధిలో మరో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చాకిచెర్ల పంచాయతీ పరిధిలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా  తుఫాన్ సెంటర్ నందు దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు. ఈ  నాలుగు సెంటర్లలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయా పరిధిలోని రైతులు పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రం లో నమోదు చేసుకుని రైతులు తమ యొక్క పంట సాగు ఆగు వివరములను తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రం లో నమోదు చేసుకోవలెను. రైతులు ధాన్యము ప్రభుత్వం వారికి అమ్మేటప్పుడు రైతు భరోసా కేంద్రం లో రైతు తమ యొక్క పొలము యొక్క పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబరు నమోదు చేయించుకుని దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధర కి ధాన్యాన్ని మద్దతు ధర సాధారణ రకం క్వింటా ధర 1868/-, గ్రేడ్ ఏ రకము క్వింటా ధర1888 మద్దతు ధరకు తీసుకోవటం జరుగుతుందని అదేవిధంగా 75 కేజీలు కలిగిన ధాన్యం బస్తా మద్దతు ధర 1401  గ్రేడ్ఏ ధాన్యంరక్తం1416 మద్దతు ధర నిర్ణయించడం దొరుకుతుంది ,తేమ శాతం 17 శాతం కలిగి ఉండాలని అని ప్రభుత్వ సూచనల మేరకు డి ఆర్ డి ఎ వెలుగు ఆఫీస్ ఏ పి ఎం చెన్నయ్య ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది పంచాయితీ సర్పంచులు రైతులతో కలిసి దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు ఉపయోగపడే విధంగా ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కూనం అనిల్ రెడ్డి, సిహెచ్ కెజియారాణి, వీరమల్లు విజయమ్మ, బి విజయమ్మ, జయరాంరెడ్డి , కృష్ణారెడ్డి, నల్లపురెడ్డి మధుసూదన్ రెడ్డి, సన్నీ బోయిన మాధవరావు, గంటా శ్రీనివాసరావు,సి సి చిరంజీవి, విఆర్వో పేరయ్య,సచివాలయసిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...