తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఎం.రవీంద్ర
విశాఖపట్నం, పెన్ పవర్
ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాక్సినేషన్ లో భాగంగా ఇచ్చే రెండవ డోసు కు కోవాక్సిన్ డోసులు తగినన్ని అందుబాటులో లేక కోవాక్సిన్ మొదటి డోసు వేసుకొని రెండవ డోసు కొరకు చాలామంది నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా వాక్సినేషన్ ప్రక్రియను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలోనే చేపట్టడంతో అధిక శాతం ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూ లైన్ లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, కావున ప్రైవేటు ఆసుపత్రులలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచితే డబ్బులు వెచ్చించి వ్యాక్సిన్ వేయించుకునేవారైనా కొవిడ్ బారినుండి రక్షింపబడతారని,కరోనా బారిన పడి ఆక్సిజెన్ అందక ఇబ్బంది పడుతున్న రోగులకు సరిపడా ఆక్సిజెన్ సరఫరా చేయకపోవడంతో, ఆక్సిజెన్ అందక చాలామంది కరోనా రోగులు ఆసుపత్రుల బయటనే చనిపోతున్నారని, ఆక్సిజెన్ సరఫరాను కూడా పెంచాలని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకూ కరోనా సోకినట్లైతే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని,వారికి సరైన అవగాహన కల్పించి తగిన చికిత్సను అందజేయాలని, కరోనా టెస్టులు చేయించుకున్న తరువాత ఐదు రోజుల నుండి వారం రోజుల వరకు గానీ ఆ టెస్టు రిపోర్టులు రానటువంటి పరిస్థితి ఏర్పడటం వలన,ఈలోపు టెస్టు చేయించుకున్న వ్యక్తికీ గానీ కరోనా ఉన్నట్లయితే మరికొంతమందికి వ్యాపించే అవకాశం ఉన్నదనిి, కరోనా టెస్టుల ఫలితాలు వీలైనంత త్వరగా వెల్లడించి రోగులు తగు జాగ్రత్తలు తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే టెస్టు రిపోర్టులు వచ్చేవరకు ఆగకుండా వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టి కరోనా బారిన పడిన వారి ప్రాణాలను కాపాడాలని భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
No comments:
Post a Comment