సర్పంచ్ గారికి గ్రామ ప్రజల మనవి..
గతం లో మాజీ సర్పంచ్ లు చేసిన పొరపాట్లు మీరు చెయ్యద్దు
మీ పై పెట్టుకున్న ఆశలు నిజం చేయండి,
పంచాయితి ని అబివృద్ది పదం లో నడిపించండి
కురుపాం, పెన్ పవర్
మండలం లోని అన్ని పంచాయితి లలో పెద్ద పంచాయితి కురుపాం పేరుకే మేజర్ పంచాయితి అబివృద్ది లో మాత్రం చిన్న పంచాయితి,అయితే జరిగిన పంచాయితి ఎన్నికల్లో సర్పంచ్ గా డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి బలపరిచిన అబ్యర్ది గార్ల సుజాత గెలుపొందారు, ఆమె చదువుకున్న వ్యక్తి యువ వయస్సు కలవారు కావడం తో పంచాయితి ప్రజలు ఆమె పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు, కాగా గతం లో కురుపాం మేజర్ పంచాయితి మాజీ సర్పంచ్ లు తీవ్ర నిరాశ కు గురిచేశారు,దీనితో అభిమానులు కార్యకర్తలు ఇమే పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు,గెలిచిన తరవాత ఇమే ఇంత వరుకు ప్రజల్లోకి కానీ కోవిడ్ కష్టకాలం లో పంచాయితి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షన గాని , లాక్ డౌన్ లాంటి నిర్ణయాల్లో భాగస్వామ్యం కానీ లేదు,ఎలాంటి కారణాలతో ఆమె చురుగ్గా లేరో తెలియదు కాని ఇక ముందు చురుగ్గా ఉండాలని ఆమె పంచాయితి కి ఫలానా సమస్య లేదా ఫలానా నిధులు కావాలి అంటే క్షణాల్లో తగిన చర్యలు తీసుకునే డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఉన్నారు కావున, వినియోగించుకోవాలని పంచాయితి అబివృద్ది తమతోనే సాధ్యం అయ్యేలా చూడాలని పంచాయితి ప్రజలు కోరుతున్నారు,గ్రామానికి ప్రధమ పౌరరాలు కావున కోవిడ్ కష్ట కాలం లో పక్కా ప్రణాళిక ఏర్పరచుకొని అధికారులు తో కలిసి చురుగ్గా పంచాయితి లో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు ప్రారంభించాలని ,హైపోక్లోరైట్ లాంటివి గ్రామంలో పిచికారీ చేయించి పారాశుద్య పనులు చురుగ్గా సాగెలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment