Followers

అట్రాసిటీ కేసుపై సెల్-వన్ డిఎస్పీ విచారణ...

అట్రాసిటీ కేసుపై సెల్-వన్ డిఎస్పీ విచారణ...

 సామర్లకోట, పెన్ పవర్ :      

సామర్లకోట పోలీసు స్టేషన్లో మూడు రోజుల క్రితం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై కాకినాడ ఎస్సీ, ఎస్టీ సెల్-వన్ డిఎస్బీ అప్పారావు శనివారం ప్రత్యేక విచారణ జరిపారు. స్థానిక ఉప్పువారి వీదికి చెందిన వాలంటీరుకు, వారి వర్గీయులకు, ఉప్పువారి వీదికి చెందిన యువకులకు ఈ నెల 28వ తేదీన ఘర్షణ జరగగా పలువురు యువకులు గాయాల పాలవగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఒసీ సామాజిక వర్గానికి చెందిన యువకులపై వాలంటీరు విధుల్లో ఉన్న తనను కులం పేరుతో దూషించడమే కాకుండా ఈ విషయంపై సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు వెళ్ళిన తమ నాయకులపై అవతలి వర్గం దాడికి దిగి కులం పేరుతో దూషిస్తూ గాయాల పాలు చేసారంటూ స్థానిక పోలీసు స్టేషన్లో అట్రాసిటీ ఫిర్యాదు చేసారు. ఆ వివాదంలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. దానికి సంబందించి శనివారం ఉదయం కాకినాడ ఎస్సీ, ఎస్టీ సెల్-1 డిఎస్పీ  అప్పారావు విచ్చేసి సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. ఉదయం నుంచి మధ్యహ్నం వరకు ఫిర్యాదు దారుల వర్గానికి సంబంధించిన 11 మందిని డిఎస్పీ విచారించి వారి వాంగ్మూలాలను రికార్డు చేసారు. కాగా విచారణ ప్రస్తుతానికి ఒక వర్గానికి సంబందించి మాత్రమే పూర్తయిందని, మరలా రెండో వర్గం నుంచి విచారణ నిర్వహించనున్నట్టు డిఎస్పీ చెప్పారు.  తదుపరి చర్యల నిమిత్తం ముందుకెళ్ళనున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ విచారణను స్థానిక విఆర్వో సత్యన్నారాయణ సమక్షంలో చేపట్టగా స్థానిక ఎస్ ఐ సుమంత్, స్టేషన్ సిబ్బంది విచారణలో పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...