పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి
పాడేరు, పెన్ పవర్
పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు అపరేటర్లు సిబ్బందిని తక్షణమే నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా కన్వీనర్ రామారావు దొర , కో-కన్వీనర్: కూడ రాధాకృష్ణ బూడిద సుమన్ ,ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాలకు ఏకైక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పాడేరు లోనే ఉంది. నిత్యం వందలాది మంది వైద్యం పొందుటకు పాడేరు జిల్లా ఆస్పత్రికి వస్తూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో పాడేరులో వైద్యం చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఇక్కడ సరైన సిబ్బంది లేక కెజిహెచ్ కు రిఫరల్ చేస్తూ ఉంటారు. దానివల్ల మార్గమధ్యంలోనే అనేక మంది చనిపోతున్నా ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆక్సిజన్ వెంటిలేటర్ అందక ఒక వ్యక్తి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో గంట వ్యవధిలోనే మరణించిన పరిస్థితి ఉందని, తక్షణమే ఆదివాసీల ప్రాణాలు కాపాడుటకు ఆక్సిజన్ వెంటిలేటర్ సిబ్బందిని నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment