కరోనాతో ఇరిగేషన్ ఏ ఈ జగన్నాథ మృతి
మెంటాడ మండలం, ఆండ్ర రిజర్వాయర్ పరిధిలోని ఇరిగేషన్ ఏ ఈ గా విధులు నిర్వహిస్తున్న టి. జగన్నాథం ఈ తెల్లవారుజామున కరోనాతో మృతి చెందినట్లు ఇరిగేషన్ డీఈ పాండు తెలిపారు. ప్రస్తుతము ఆయన దత్తిరాజేరు మండలం ఇరిగేషన్ ఏ ఈ గా విధులు నిర్వహిస్తున్నారని డి ఈ పాండు తెలిపారు. జగన్నాథం మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధ తిరిగేసి అధికారులంతా సంతాపం తెలిపారు. వృత్తినే దైవంగా భావించి అనుదినం ఆయన విధులు నిర్వహించే వారిని అటువంటి వ్యక్తి చనిపోవడం బాధాకరమని పలువురు మండల స్థాయి అధికారులు, గజపతినగరం సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
No comments:
Post a Comment